బిగ్ బాస్ సీజన్ 5: నాలుగవ కంటెస్టెంట్ గా ఇండియన్ ఐడల్ విన్నర్, సింగర్, యాక్టర్ శ్రీరామ చంద్ర

Published : Sep 05, 2021, 07:18 PM IST
బిగ్ బాస్ సీజన్ 5: నాలుగవ కంటెస్టెంట్ గా ఇండియన్ ఐడల్ విన్నర్, సింగర్, యాక్టర్ శ్రీరామ చంద్ర

సారాంశం

యూట్యూబర్ సిరి హన్మంత్, నటుడు సన్నీ, లహరి హౌస్లో కి వరుసగా ప్రవేశించగా... నాలుగవ కంటెస్టెంట్ గా సింగర్ శ్రీరామ చంద్ర ఎంట్రీ ఇచ్చారు. మన్మధుడు మూవీలోని ''నేను నేనుగా లేనే నిన్న మొన్నలా'' అనే రొమాంటిక్ సాంగ్ శ్రీరామ చంద్ర లైవ్ లో హృద్యంగా పాడారు. 

బిగ్ బాస్ సీజన్ 5 మరింత ఎంటర్టైన్మెంట్ అందించనుంది హౌస్ లోకి వెళుతున్న కంటెస్టెంట్స్ ని చూస్తే అర్థం అవుతుంది. యూట్యూబర్ సిరి హన్మంత్, నటుడు సన్నీ, లహరి హౌస్లో కి వరుసగా ప్రవేశించగా... నాలుగవ కంటెస్టెంట్ గా సింగర్ శ్రీరామ చంద్ర ఎంట్రీ ఇచ్చారు. మన్మధుడు మూవీలోని ''నేను నేనుగా లేనే నిన్న మొన్నలా'' అనే రొమాంటిక్ సాంగ్ శ్రీరామ చంద్ర లైవ్ లో హృద్యంగా పాడారు. 


2010 ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ సింగింగ్ షో ఇండియన్ ఐడల్ విన్నర్ గా శ్రీరామ్ చంద్ర నిలిచారు. పలు భాషల్లో వందల సంఖ్యలో శ్రీరామ చంద్ర సాంగ్స్ పాడడం జరిగింది. ఇండియన్ ఐడల్ షోతో వచ్చిన పాపులారిటీతో హీరోగా కూడా సినిమాలు చేశారు. మూడు సినిమాలలో శ్రీరామ్ చంద్ర నటించడం జరిగింది. 


ఇక బిగ్ బాస్ వేదికపైకి నాగ్ శ్రీరామ్ చంద్రకి గ్రాండ్ వెల్కమ్ పలికారు.  పేరుకు తగ్గట్టే శ్రీరామ చంద్ర శ్రీరామ చంద్రుడేనా అని నాగార్జున అడిగారు. నిజంగా నేను శ్రీరాముడినే అన్నాడు శ్రీరామ్ చంద్ర. ఇక నాగ్ కోసం గీతాంజలి మూవీ నుండి ఓ సాంగ్ పాడి డెడికేట్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు దగ్గరకు కావడానికే హౌస్ లోకి వెళుతున్నట్లు వెల్లడించారు. 
 

PREV
click me!

Recommended Stories

Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు