బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ కంటెస్టెంట్ గా సిరి హన్మంత్... రావడంతోనే టాస్క్ చేయించిన నాగ్!

Published : Sep 05, 2021, 06:48 PM IST
బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ కంటెస్టెంట్ గా సిరి హన్మంత్... రావడంతోనే టాస్క్ చేయించిన నాగ్!

సారాంశం

కింగ్ నాగార్జున ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆమె డాన్స్ అదిరిపోయిందంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. నువ్వు మంచి ఎక్సప్రెస్సివ్ అంట కదా, అనిపించింది చెప్పేస్తావ్ అంట కదా అని అడిగారు. 

బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ కంటెస్టెంట్ వేదికపైకి వచ్చేసింది. యూట్యూబర్ సిరి హన్మంత్ ఆ లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. క్రాక్ మూవీలోని ఐటెం సాంగ్ 'చీమకుర్తిలో కన్ను తెరిచా.. చినగంజాంలో నా వళ్ళు విరిచా..' సాంగ్ తో సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చారు. టాప్ టు బాటమ్ గోల్డెన్ కలర్ లో ఉన్న ట్రెండీ వేర్ ధరించిన సిరి హన్మంత్ ఆసక్తికర స్టెప్స్ తో అలరించింది. 


ఇక కింగ్ నాగార్జున ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆమె డాన్స్ అదిరిపోయిందంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. నువ్వు మంచి ఎక్సప్రెస్సివ్ అంట కదా, అనిపించింది చెప్పేస్తావ్ అంట కదా అని అడిగారు. అలాగే ఆమెతో ఓ టాస్క్ చేయించారు. 'నాకు నచ్చినవి రెండే రెండు ఒకటి మంచి నిద్ర, మంచి మొగుడు' అనే డైలాగ్ ని నవరసాలలో భాగమైన హాస్యం,భయం, ఏడుపు, శృంగారం, కరుణలలో చెప్పి చూపించమన్నారు. 


ఇచ్చిన టాస్క్ చక్కగా పూర్తి చేసిన సిరి హన్మంత్... ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధం అంటూ.. ప్రామిస్ చేశారు. ఈ సీజన్ కి గాను హౌస్ లో అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ సిరి హన్మంత్ అయ్యారు. హౌస్ లోకి వెళ్లిన వెంటనే హౌస్ మొత్తం అబ్సర్వ్ చేశారు సిరి. ఆమె మార్కు డైలాగ్ ఒడియమ్మా అంటూ... ఆనందం వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి