ఎలిమినేషన్ డే... ఉత్కంఠ మధ్య ప్రియ ఇన్ లహరి అవుట్?

Published : Sep 26, 2021, 05:57 PM IST
ఎలిమినేషన్ డే... ఉత్కంఠ మధ్య ప్రియ ఇన్ లహరి అవుట్?

సారాంశం

ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఐదుగురు సభ్యులు ఉండగా ప్రియాంక సింగ్, శ్రీరామ్ నిన్న సేవ్ అయ్యారు. మానస్ కూడా నేడు సేవ్ కాగా, చివరికి ఇద్దరు మిగిలారు.   


మూడవ ఆదివారం అంటే మూడవ ఎలిమినేషన్. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 17మంది సభ్యులు ఉన్నారు. సరయు, ఉమాదేవి ఎలిమినేషన్స్ తరువాత మూడవ ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్లనున్నారని ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఐదుగురు సభ్యులు ఉండగా ప్రియాంక సింగ్, శ్రీరామ్ నిన్న సేవ్ అయ్యారు. మానస్ కూడా నేడు సేవ్ కాగా, చివరికి ఇద్దరు మిగిలారు. 


ప్రియ, లహరి ఇద్దరిలో ఒకరు హౌస్ ను వీడనున్నారు. హోస్ట్ నాగార్జున.. రెండు లైట్స్ తీసుకు వచ్చారు. ఒక లైట్ పై ప్రియ పేరు, మరొక లైట్ పై లహరి పేరు రాసి ఉంది. ఎవరు పేరు రాసి ఉన్న లైట్ రెడ్ నుండి గ్రీన్ గా మారుతుందో, వారు సేవ్ అయినట్లు, మిగతా వారు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలిపారు. 


ప్రియ పేరు రాసి ఉన్న లైట్ గ్రీన్ గా మారడంతో ఆమె సేవ్ కావడం, లహరి ఎలిమినేట్ కావడం జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో  లేకున్నప్పటికీ, అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం లహరి ఎలిమినేట్ అయ్యారట. ఏదిఏమైనా మరికొన్ని గంటల్లో దీనిపై స్పష్టత రానుంది.

PREV
click me!

Recommended Stories

3000 కోట్లు వసూలు చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ, OTTలో ఆస్కార్ నామినీ బ్లాక్‌బస్టర్ ను ఎక్కడ చూడొచ్చంటే?
అప్పుడు జబర్దస్త్‌లో చేరమని పదేపదే కోరారు.. కానీ.! ఆ తర్వాత జరిగిందిదే: బలగం వేణు