
దేశంలోనే హాట్ ఫేవరెట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ ఉంది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)నేతృత్వంలో ఏళ్ల తరబడి సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇక నాలుగు నెలల క్రితం బిగ్ బాస్ సీజన్ 15 ప్రారంభం కాగా జనవరి 30 ఆదివారం గ్రాండ్ ఫినాలే చోటు చేసుకుంది. టైటిల్ కోసం ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ లో పోటీపడగా ప్రేక్షకులు తేజస్వి ప్రకాష్ కి పట్టం కట్టారు. అత్యధిక ఓట్లు సంపాదించినా తేజస్వి టైటిల్ గెలుచుకున్నారు.
మిస్టర్ షెహజ్ పాల్ రన్నర్ గా నిలిచాడు. బుల్లితెర యాక్ట్రెస్ గా పాపులారిటీ ఉన్న తేజస్వి ప్రకాష్(Tejasswi Prakash) టైటిల్ ఫేవరేట్ గా షోలోకి ఎంటర్ అయ్యారు. హౌస్ లో ఆమె ముక్కుసూటి తనం, ఏదైనా నిర్భయంగా మాట్లాడే తత్వం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ షో సమయంలో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. ప్రేక్షకులు మూకుమ్మడిగా ఓట్లు వేసి గెలిపించారు. టైటిల్ గెలుచుకున్న తేజస్వి ఆనందం వ్యక్తం చేశారు.
ఆమె మాట్లాడుతూ... హౌస్ లోకి అడుగు పెట్టగానే ఏదో కలలా అనిపించింది. మెల్లగా పరిస్థితులకు అలవాటు పడ్డాను. గేమ్ ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. నేను తీసుకెళుతుంది ప్రైజ్ మనీ మాత్రమే కాదు అంతకు మించి విలువైన అనుభవాలు, జ్ఞాపకాలు. సల్మాన్ సర్ సప్పోర్ట్ వలనే విన్నర్ అయ్యాను. కలర్స్ టీవీ యాజమాన్యానికి, ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. .అంటూ తన సంతోషం వ్యక్తం చేశారు.
ఇక హౌస్ లో తేజస్వి మరో కంటెస్టెంట్ కరణ్ కుంద్రా ప్రేమలో పడ్డారు. జంటగా వీరిద్దరూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. తేజస్వి-కుంద్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కరణ్ కుంద్రా సైతం ఫైనల్ కి చేరాడు. అతడు మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. తేజస్వి ప్రకాష్ త్వరలో ప్రసారం కానున్న నాగిని 6 సీరియల్ లో మెయిన్ లీడ్ చేయనున్నారు. ఇక తేజస్వి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.