బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్ ఈ అమ్మాయే... ఇంతకీ ఎవరో తెలుసా?

By Sambi ReddyFirst Published Jun 19, 2024, 2:26 PM IST
Highlights

బిగ్ బాస్ హౌస్ సామాన్యులను సెలబ్రిటీలు చేస్తుంది. రైతులు, ఉద్యోగులు, సోషల్ మీడియా స్టార్స్, యూట్యూబర్స్ హౌస్లో అడుగుపెట్టి క్రేజ్ రాబట్టారు. తాజాగా వడాపావ్ అమ్మే అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టనుంది. 
 

బిగ్ బాస్ దేశవ్యాప్తంగా క్రేజియస్ట్ షోగా ఉంది. ప్రసారం అవుతున్న అన్ని భాషల్లో సూపర్ హిట్ అని చెప్పాలి. ఇండియాలో హిందీ భాషలో మొదట బిగ్ బాస్ ప్రసారం అయ్యింది. అనంతరం కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు ఇతర భాషలకు వ్యాపించింది. ఈ షోకి వస్తున్న ఆదరణ రీత్యా ఓటీటీ వెర్షన్ కూడా అందుబాటులోకి తెచ్చారు. రెగ్యులర్ బిగ్ బాస్ హిందీ..  17 సీజన్స్ పూర్తి చేసుకుంది. అలాగే రెండు ఓటీటీ సీజన్స్ స్ట్రీమ్ అయ్యాయి. 

ఓటీటీ ఫస్ట్ సీజన్ కి కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించాడు. 13 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా నటి దివ్య అగర్వాల్ విజేతగా నిలిచింది. ఆమెకు రూ. 25 లక్షల ప్రైజ్ మనీ లభించింది. వూట్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ఫస్ట్ సీజన్ ప్రసారం అయ్యింది. ఇక సెకండ్ సీజన్ కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్నారు. 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. నటుడు ఎల్విష్ యాదవ్ టైటిల్ అందుకున్నాడు. రూ. 25 లక్షలు సొంతం చేసుకున్నాడు. 

Latest Videos

ముచ్చటగా మూడో సీజన్ కి రంగం సిద్ధమైంది. జూన్ 21 నుండి జియో సినిమాలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 స్ట్రీమ్ కానుంది. కాగా ఫస్ట్ కంటెస్టెంట్ పై జియో సినిమా హింట్ ఇచ్చింది. తన అధికారిక ఖాతాలో ఓ అమ్మాయి ఫోటో షేర్ చేసిన జియో సినిమా ప్రతినిధులు... ఈమెనే ఫస్ట్ కంటెస్టెంట్ అని కామెంట్ చేశారు. 

ఫోటో అస్పష్టంగా ఉన్నప్పటికీ నెటిజెన్స్ ఆమె ఎవరో కనిపెట్టారు. ఆ అమ్మాయి పేరు చంద్రిక. ఈమె ఢిల్లీ వీధుల్లో వడాపావ్ అమ్ముతూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. ఆమెకు సీజన్ 3లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దక్కింది. మరి ఈ వడాపావ్ గర్ల్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సీజన్ 3 హోస్ట్ గా నటుడు అనిల్ కపూర్ వ్యవహరిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో అతడు తప్పుకున్నాడని సమాచారం.. 

click me!