Latest Videos

రజినీకాంత్ మూవీలో నటించి తప్పు చేశా... స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

By Sambi ReddyFirst Published Jun 19, 2024, 1:46 PM IST
Highlights

రజినీకాంత్ మూవీలో నటించకుండా ఉండాల్సింది అంటుంది హీరోయిన్ మమతా మోహన్ దాస్. రజినీకాంత్ చిత్రం విషయంలో తనకు అన్యాయం జరిగిన రీత్యా ఆమె ఈ కామెంట్స్ చేసింది. 
 

మలయాళ భామ మమతా మోహన్ దాస్ యాక్టర్ కమ్ సింగర్. 2007లో విడుదలైన యమదొంగ చిత్రంతో తెలుగు ఆడియన్స్ ని పలకరించింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో ఎన్టీఆర్-మమతా మోహన్ దాస్ మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఎన్టీఆర్ తో ఆమెకు రెండు సాంగ్స్ కూడా ఉన్నాయి. 'ఓలమ్మీ తిక్కరేగిందా' సాంగ్ కలిసి పాడటంతో పాటు నటించారు ఎన్టీఆర్-మమతా మోహన్ దాస్. అనంతరం పలు తెలుగు చిత్రాల్లో ఆమె నటించింది.

2008లో పి. వాసు దర్శకత్వంలో వచ్చిన కుచేలన్ మూవీలో ఓ సాంగ్ లో మమతా మోహన్ దాస్ కనిపిస్తారు. రజినీకాంత్ జీవితానికి దగ్గరగా ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నయనతార హీరోయిన్ గా నటించింది. తెలుగులో కథానాయకుడు టైటిల్ తో విడుదల చేశారు. రజినీకాంత్ చిన్ననాటి మిత్రుడు పాత్రలో జగపతిబాబు నటించాడు. ఆయన భార్యగా మీన చేసింది. కథానాయకుడు ఆశించిన స్థాయిలో ఆడలేదు. 

కుచేలన్ మూవీలోని సాంగ్ కోసం మమతా మోహన్ దాస్ రెండు రోజులు షూటింగ్ చేసిందట. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే కేవలం ఆ పాటలో జస్ట్ ఒక సెకను మమతా దాస్ ని చూపించారట. ఈ క్రమంలో వేదనకు గురైన మమతా మోహన్ దాస్ కుచేలన్ మూవీలో నటించకుండా ఉండాల్సింది. ఆ మూవీలో నటించి తప్పు చేశానని ఓ సందర్భంలో అన్నారు. 

కాగా మమతా మోహన్ దాస్ పార్ట్ ఎడిటింగ్ లో లేపేయడానికి కారణం నయనతార అని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఆ సాంగ్ లో నయనతారతో పాటు మమతా మోహన్ దాస్ నటిస్తున్న విషయాన్ని ఆమెకు చెప్పలేదట. అందుకు దర్శకుడి మీద నయనతార కోప్పడ్డారట. ఆమె ఒత్తిడి మేరకే పాటలో మమతా మోహన్ దాస్ పార్ట్ కట్ చేశారని సమాచారం. కాగా క్యాన్సర్ బారినపడిన మమతా మోహన్ దాస్ చికిత్స అనంతరం కోలుకున్నారు. 

click me!