'హలో గురు ప్రేమకోసమే' టీజర్.. హాట్ గా ఉంది!

Published : Sep 17, 2018, 05:24 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
'హలో గురు ప్రేమకోసమే' టీజర్.. హాట్ గా ఉంది!

సారాంశం

'నేను శైలజ' సినిమా తరువాత హీరో రామ్ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. 'నేను లోకల్' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు త్రినాధరావు నక్కినతో కలిసి 'హలో గురు ప్రేమకోసమే' అనే సినిమాలో నటిస్తున్నాడు. 

'నేను శైలజ' సినిమా తరువాత హీరో రామ్ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. 'నేను లోకల్' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు త్రినాధరావు నక్కినతో కలిసి 'హలో గురు ప్రేమకోసమే' అనే సినిమాలో నటిస్తున్నాడు.

దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ లో రామ్ చెప్పిన డైలాగ్ లానే చాలా హాట్ గా ఉంది ఈ టీజర్. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జుట్టు ఆరబెట్టుకుంటూ ఉండగా.. వెనుక నుండి ఆమె తదేకంగా చూస్తూ ఉండిపోతాడు హీరో రామ్.

ఆమె మాటలతో ఒక్కసారిగా తేరుకొని చాలా హాట్ గా ఉంది కాఫీ అంటూ అనుపమకి సమాధానం చెబుతాడు. ఈ టీజర్ కి దేవిశ్రీప్రసాద్ అందించిన నేపధ్య సంగీతం హైలైట్ గా నిలిచింది.  టీజర్ ని బట్టి ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అనిపిస్తుంది. పైగా త్రినాధరావు కెరీర్ లో హిట్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాపై రామ్ చాలా నమ్మకంతో ఉన్నాడు.  

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా