Siri Hanmanth: దీప్తి-షణ్ముఖ్ ప్రేమ అంత వీక్ కాదు...!

By Sambi ReddyFirst Published Jan 14, 2022, 8:44 PM IST
Highlights

సిరి తాజాగా ఈ కామెంట్స్ పై స్పందించారు. వంద రోజుల ప్రయాణంలో ఎమోషనల్ గా దగ్గరయ్యాం. అయితే మా మధ్య ఉంది కేవలం స్నేహం మాత్రమే. షణ్ముఖ్ తో పాటు దీప్తి కూడా నాకు మంచి ఫ్రెండ్. 


బిగ్ బాస్ సీజన్ 5 (Biggboss telugu 5)కంటెస్టెంట్స్ లో షణ్ముఖ్, సిరి ఫైనల్ కి చేరారు. ఫ్రెండ్స్ గా హౌస్ లో వీరిద్దరు ఒకరికొకరు అన్నట్లు గడిపారు. సిరి ఫైనల్ లో ఐదవ స్థానంతో సరిపెట్టుకోగా, షణ్ముఖ్ రన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ 5 టైటిల్ కోసం సన్నీ-షణ్ముఖ్ పోటీపడగా... అత్యధిక ఓట్లు దక్కించుకున్న సన్నీ టైటిల్ అందుకున్నారు. ఇదిలా ఉంటే హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే షణ్ముఖ్ కి భారీ షాక్ ఎదురైంది. ఆయన లాంగ్ టర్మ్ లవర్ దీప్తి సునైన బ్రేకప్ చెప్పేసింది. 

దీప్తి సోషల్ మీడియా పోస్ట్స్ గమనించిన కొందరు.. ఆమె షణ్ముఖ్(Deepthi Sunaina) తో బ్రేకప్ కానున్నారని ఉహాగానాలు మొదలయ్యాయి. అందరి అనుమానాలు నిజం చేస్తూ దీప్తి సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు వెల్లడించారు. దీప్తి ప్రకటనతో అందరి కళ్ళు సిరి వైపు మళ్ళాయి. దీప్తి షణ్ముఖ్ తో విడిపోవడానికి సిరినే కారణమంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. బిగ్ బాస్ హౌస్ లో సిరి-షణ్ముఖ్ చాలా సన్నిహితంగా ఉన్నారు. 

ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే హద్దులు మీరిన రొమాన్స్ లో మునిగిపోయేవారు. ఒక డీప్ లవ్ కపుల్ మధ్య నెలకొనే అలకలు, కోపాలు, ప్రేమలు, గిల్లికజ్జాలు వీరి మధ్య చోటు చేసుకునేవి. తన వెంటపడుతున్న సిరిని షణ్ముఖ్ అకారణంగా తిట్టడం, దానితో ఆమె అలగడం జరిగేది. ఎమోషనల్ గా బాగా దగ్గరయ్యాం. గేమ్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నామని సిరి, షణ్ముఖ్ స్వయంగా ఒప్పుకున్నారు. 

సిరికి దగ్గరైన షణ్ముఖ్ తనను మోసం చేశాడని భావిస్తున్న దీప్తి (Deepthi Sunaina)ఆయనతో విడిపోయారనేది ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే సిరి తాజాగా ఈ కామెంట్స్ పై స్పందించారు. వంద రోజుల ప్రయాణంలో ఎమోషనల్ గా దగ్గరయ్యాం. అయితే మా మధ్య ఉంది కేవలం స్నేహం మాత్రమే. షణ్ముఖ్ తో పాటు దీప్తి కూడా నాకు మంచి ఫ్రెండ్. దీప్తి-షణ్ముఖ్ విడిపోవడానికి కేవలం నేను కారణం అనేది నిజం కాదు. 

వంద రోజుల్లో మా మధ్య ఏదో జరిగిందని విడిపోయేంత బలహీనమైన ప్రేమ కాదు వారిది. ఇక సోషల్ మీడియాలో తనపై వచ్చిన ట్రోలింగ్స్ వలన డిప్రెషన్ ఫీల్ అయ్యానని సిరి చెప్పుకోచ్చారు. మరోవైపు సిరి (Siri)శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. సిరి కోసం శ్రీహాన్ బిగ్ బాస్ వేదికపైకి కూడా వచ్చారు. కాగా షణ్ముఖ్ పేరెంట్స్ ఈ బ్రేకప్ పై స్పందించారు. మరలా దీప్తి-షణ్ముఖ్ కలుసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

షణ్ముఖ్ తో బ్రేకప్ తర్వాత దీప్తి సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడారు. జీవితంలో ఎప్పుడూ ఇతరుల గురించే ఆలోచించాను, ఇకపై తన గురించి తానూ ఆలోచిస్తాను. కెరీర్ పై ఫోకస్ పెడతామని దీప్తి తెలియజేశారు. బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న దీప్తి సునైన.. షణ్ముఖ్ తో కలిసి అనేక సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్లు చేశారు. 

click me!