Shruti Haasan: ప్రియుడితో శృతి హాసన్ రొమాన్స్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రైవేట్ వీడియో!

Published : Mar 12, 2023, 05:47 AM ISTUpdated : Mar 12, 2023, 06:31 AM IST
Shruti Haasan: ప్రియుడితో శృతి హాసన్ రొమాన్స్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రైవేట్ వీడియో!

సారాంశం

హీరోయిన్ శృతి హాసన్ బోల్డ్ యాటిట్యూడ్ కి ఈ సంఘటన నిదర్శనం. బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేసిన వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన శృతి అందరికీ షాక్ ఇచ్చింది.   


స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చాలా ఇండిపెండెంట్. ఆమె ఆలోచనా ధోరణి భిన్నంగా ఉంటుంది. చెప్పాలంటే పాశ్చాత్య సంస్కృతి ఫాలో అవుతారు. నచ్చినట్లు బ్రతకడమే మన సిద్ధాంతం అంటారు. సాధారణంగా హీరోయిన్స్ తమ ఎఫైర్స్, రిలేషన్స్ గురించి బయట పడేందుకు ఇష్టపడరు. ఎవరినైనా ప్రేమించినా... చాలా రహస్యంగా ఉంచుతారు. శృతి అలా చేయరు. ఏదైనా అందరికి తెలిసేలా పబ్లిక్ గా చేస్తారు. గతంలో శృతి హాసన్ లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో ఎఫైర్ నడిపారు. అతనితో శృతి బహిరంగంగా  తిరిగారు. 2019లో శృతి-మైఖేల్ బ్రేకప్ చెప్పుకున్నారు. 

ప్రస్తుతం ఆమె ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ఎఫైర్ లో ఉన్నారు. చెప్పాలంటే శృతి-శాంతను సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. శాంతను గురించి కూడా శృతి సమాజానికి చెప్పేశారు. అయితే ఏనాడూ బాయ్ ఫ్రెండ్ అని ప్రకటించలేదు. అతనితో సన్నిహితంగా ఉంటూ పరోక్షంగా హింట్ ఇచ్చారు. శాంతనుతో తన హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంస్టాగ్రామ్ లో నేరుగా పంచుకుంటారు. 

తాజాగా శృతి ప్రియుడితో రొమాన్స్ చేస్తూ ఒక వీడియో చేశారు. సదరు వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు.పెళ్లి కాకుండా రొమాన్స్ చేయడం ఇండియన్ సొసైటీ తప్పుగా చూస్తుంది. అలాంటిది, నలుగురికీ తెలిసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అతి పెద్ద సాహసం. మరి శృతి హాసన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ప్రియుడితో శృతి రొమాంటిక్ వీడియో వైరల్ అవుతుండగా,ఫ్యాన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. 

ఇక శృతి కెరీర్ గాడిన పడింది. సంక్రాంతి హీరోయిన్ గా రెండు సూపర్ హిట్స్ శృతి ఖాతాలో పడ్డాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల్లో శృతి హీరోయిన్ గా నటించారు. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య వసూళ్లు దుమ్ముదులిపింది. 2023 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. యావరేజ్ కంటెంట్ అయినప్పటికీ పండగ సీజన్ కలిసొచ్చింది. రెండు మాస్ చిత్రాలను జనాలు ఆదరించారు. 

శృతి చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్ట్ సలార్. దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తుండగా సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సలార్ మూవీలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ విలన్ రోల్ చేస్తున్నారు. అలాగే జగపతిబాబు ఒక పాత్ర చేస్తున్నారు. సలార్ ప్రభాస్ కెరీర్లో భారీ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. సలార్ విజయంతో శృతి కెరీర్ మరో రేంజ్ కి వెళ్లడం ఖాయం... 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే