
బిగ్ బాస్ సీజన్ 5 (Bigg boss telugu 5) లో పాల్గొన్న షణ్ముఖ్ రన్నర్ గా నిలిచాడు.షణ్ముఖ్ హౌస్ నుండి బయటికొచ్చిన రోజుల వ్యవధిలో దీప్తి అతనితో విడిపోతున్నట్లు వెల్లడించారు. దీప్తి, షణ్ముఖ్ మధ్య మనస్పర్థలు తలెత్తాయన్న పుకార్లు చెలరేగాయి. వాటిని నిజం చేస్తూ... దీప్తి సోషల్ మీడియా ద్వారా బ్రేకప్ ప్రకటన చేసింది. ఇక దీప్తి ప్రియుడు షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పడానికి సిరి కారణంటూ కథనాలు వెలువడ్డాయి.
బిగ్ బాస్ హౌస్ లో సిరి(Siri), షణ్ముఖ్ చాలా సన్నిహితంగా ఉన్నారు. స్నేహితులం అంటూనే రొమాన్స్ కురిపించారు. ఇద్దరూ డీప్ లవర్స్ అన్నట్లు మెలిగారు. ఇవన్నీ గమనించిన దీప్తి ఆగ్రహానికి గురయ్యారని, సిరితో షణ్ముఖ్ కి ఎఫైర్ ఉందని ఆమె భావిస్తున్నట్లు పలువురు అభిప్రాయ పడ్డారు. కారణం ఏదైనా షణ్ముఖ్ తో దీప్తి విడిపోయింది.
బ్రేకప్ చెప్పుకున్న వీరి మధ్య మానసిక యుద్ధం నడుస్తుంది. దీప్తి, షణ్ముఖ్ సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. తాజాగా షణ్ముఖ్ ఓ డాన్స్ వీడియో పోస్ట్ చేశారు. Allu Arjun ఆర్య 2 సినిమాలోని 'మై లవ్ ఈజ్ గాన్' పాటకు షణ్ముఖ్ ఇంటెన్స్ స్టెప్స్ వేసి ఆకట్టుకున్నాడు. షణ్ముఖ్ ధరించిన టీ షర్ట్ పై హార్ట్ సింబల్ కూడా ఉంది. ఈ సాంగ్ ఉద్దేశపూర్వకంగానే షణ్ముఖ్ చేశాడని నెటిజెన్స్ భావిస్తున్నారు. అలాగే డాన్స్ వీడియో ద్వారా దీప్తి సునైనకు ఆయన కౌంటర్ వేశాడనిపిస్తుంది.
మరోవైపు దీప్తి కూడా ఏం తగ్గడం లేదు. షణ్ముఖ్ (Shanmukh) ని టార్గెట్ చేస్తూ ఆమె కొటేషన్స్ కొడుతుంది. 'నాకు మనుషుల్ని అర్ధం చేసుకునే గుణం ఉంది, అలాగని మోసాన్ని కనిపెట్టలేని అమాయకురాలిని కాదు' అంటూ ఓ కామెంట్ పోస్ట్ చేసింది. ఈ కామెంట్ షణ్ముఖ్ ని ఉద్దేశించే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే క్రమంలో ఆమె షణ్ముఖ్ మోసం చేశాడని గట్టిగా నమ్ముతుందనిపిస్తుంది. మరి షణ్ముఖ్ చేసిన ఆ మోసం ఏమిటనేది, వారిద్దరికి మాత్రమే తెలిసిన నిజం.
ఒకరిపై మరొకరు ఇలా సోషల్ మీడియా దాడి చేసుకుంటూనే తమ తమ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ బ్రేకప్ కారణంగా కెరీర్ పరంగా ఇద్దరూ నష్టపోయారు. ఈ ఇద్దరు కలిసి కొన్ని సిరీస్లకు సైన్ చేయగా.. ఆ ప్రాజెక్ట్స్ సందిగ్ధంలో పడ్డట్లు సమాచారం.