భోళా శంకర్ పై బ్యాడ్ కామెంట్స్.. ఇచ్చిపడేసిన బిగ్ బాస్ లోబో..

Published : Aug 12, 2023, 07:44 PM IST
భోళా శంకర్ పై బ్యాడ్ కామెంట్స్.. ఇచ్చిపడేసిన బిగ్ బాస్ లోబో..

సారాంశం

ట్రోలర్స్ పై మండిపడ్డాడు బిగ్ బాస్ ఫేమ్ లోబో. భోళా శంకర్  సినిమాను నొటికొచ్చినట్టు మాట్లాడుతున్న కొంత మందిని నిలదీసి కడిగేశాడు. ఇంతకీ లోబో ఏమంటున్నాడంటే..?


మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెహార్ రమేష్ డైరెక్షన్ లో.. తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళంకు రీమేక్ గా తెరకెక్కింది బోళా శంకర్ సినిమా. ఈమూవీలో తమన్నా హీరోయిన్ గా నటించగా.. కీర్తి సురేష్  మెగాస్టార్ చెల్లెలిపాత్రో కనిపించింది. సుశాంత్ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ఇక ఇందులో బుల్లితెర తారలు ఆది, గెటప్ సీన్. వేణుతో పాటు.. బిగ్ బాస్ ఫేమ్ లోబో కూడా ఓ పాత్రలో కనిపించి సందడడి చేశాడు. అయితే తాజాగా ఈమూవీ గురించి మాట్లాడాడు లోబో. 

బుల్లితెరపై యాంకర్ గా జర్నీ స్టార్ట్ చేసి.. తన విచిత్రమైన గెటప్ తో అందరిని ఆకర్షిస్తూ.. అప్పుడప్పుడు సినిమాలు, సీరియల్స్.. బుల్లితెర కార్యక్రమాలు చేస్తూ.. సొంతంగా బిజినెస్ కూడా నడుపుకుంటున్నాడు లోబో. చాలా కాలం తరువాత వెడితెరపై కనిపించాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి.. చాలా రోజులు హౌస్ లో ఉండగలిగాడు. టాప్ 10 లో స్థానం సంపాదించిన లోబో.. ఆతరువాత హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇక ఈక్రమంలో ఆయన భోళా శంకర్ సినిమాలో నటించాడు. 

నిన్న (12 అగస్ట్ ) రిలీజ్ అయిన భోళా శంకర్  మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది.  కొంత మంది మాత్రం ఈసినిమా బాగుంది అంటే.. మరికొంత మంది మాత్రం ఈసినిమాను దారుణంగా విమర్షిస్తున్నారు. అస్సలు బాలేదంటూ తిట్టిపోస్తున్నారు. కొంత మంది నెగెటీవ్ కామెట్లు చేయడమే పనిగా పెట్టుకున్నారు. దాంతో ఇలా ట్రోల్ చేస్తున్నవారికి.. నెగెటీవ్ కామెంట్స్ చేసేవారికి.. తన మార్క్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు లోబో. ఆయన మాట్లాడుతూ.. గట్టిగా కౌంటర్ కూడా ఇచ్చాడు. 

ఈ క్రమంలోనే తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. బ్యాడ్ కామెంట్స్ రాస్తున్నారు.. ఇది మంచి పద్దతి కాదు అన్నారు. ఎందుకు చెత్త కామెంట్స్ రాస్తున్నారో అర్థం కావడం లేదు.. ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ రాసేముందు ఒకసారి ఆలోచించాలి.. ఒక మంచి ఇంట్లో పుడితే , ఒక మంచి తల్లికి పుడితే ఇలా బ్యాడ్ కామెంట్స్ రాయరు. అలా రాయాల్సి అవసరం ఏంటీ అంటూ.. తన మార్క్ కామెంట్స్ చేశాడు లోబో. 

 అంతే కాదు.. సినిమాపైనే కాదు.. నాపై కూడా బ్యాడ్ కామెంట్స్ రాయడం బాధ అనిపించింది. అది చాలా తప్పు.. మేము ఎంత కష్టపడతామో మీకు తెలియదు.. డైరెక్టర్లు .. ప్రొడ్యూసర్లు ఒక సినిమా బయటకు తీసుకురావడం కోసం ఎంత శ్రమిస్తారో మీకు తెలియదు.  ఎన్ని కోట్లు పెట్టి సినిమా చేస్తారో మీకు తెలియదు… ఇవన్నీ తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు అని అన్నారు. 

అంత కష్టపడిన తర్వాత మీరేమో సినిమా చూసి బాలేదు అని ఒక్క మాటతో పక్కన పడేస్తారు..  అంటూ అసభ్యకరంగా కామెంట్ చేశారు లోబో.. కష్టాన్ని నమ్మాలని.. అలా కష్టాన్ని నమ్మితే మరొకసారి ఇలా బ్యాడ్ కామెంట్ చేయరు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక లోబో కామెంట్స్ సోషల్ మీడియాలో వైరట్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్