
బిగ్ బీ అమితాబ్ కు 80 ఏళ్లు.. అయితేనే.. 20 ఏళ్ళ కుర్రాడిలా కష్టపడుతున్నాడు. సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ అంటూ.. రెస్ట్ లెస్ గా పనిచేస్తున్నాడు. తన ఒంటో ఒపిక ఉన్నంత వరకూ సినీ కళామతల్లికి సేవ చేసుకుంటానంటున్నాడు బిగ్ బీ. ఇటు సినిమాలతో పాటు.. అటు టెలివిజన్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ.. సందడి చేస్తున్నాడు బిగ్ బీ. తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి లేటెస్ట్ సీజన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ షోకు హోస్టుగా బిగ్ బీ అమితాబచ్చన్ మరోసారి సందడి చేయబోతున్నారు.
ఈ ఏజ్ లో కూడా KBC బిగ్ బి కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఒక్కో ఎపిసోడ్ కు భారీగా డిమాండ్ చేస్తున్నాడట. ఇండియన్ టీవీ ఇండస్ట్రీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ షోగా గుర్తింపు తెచ్చుకుంది. 2000 లో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్.. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ.. దాదాపు 14 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఎంతో మందిని కోటీశ్వరులను చేసిన ఈ షో కోసం కోట్లల్లో ఆడియన్స్ ఎదురు చూస్తుండగా... కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 15 ఆగష్టు 14 నుంచి స్టార్ట్ కాబోతోంది.ఈవిధంగా సోనీ టీవీ అధికారికంగా ప్రకటన చేసింది.
కౌన్ బనేగా కరోడ్ పతి ప్రకటన రాగానే టెలివిజన్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఎప్పటిలాగే అమితాబ్ హోస్ట్ అని తెలిసి దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక లేటెస్ట్ సీజన్ కోసం ఆయన భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లో ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా 4 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2000 సంవత్సరంలో ఈ షో స్టార్ట్ అవ్వగా.. ఫస్ట్ సీజన్ కోసం బిగ్ బీ అప్పట్లోనే ఎపిసోడ్ కు కోటి తీసుకున్నాడట. 2005 లో సెకండ్ సీజన్ రాగా.. ఎపిసోడ్ కు 2 కోట్లు తీసుకున్నారట బిగ్ బి.
ఇక మూడు నాలుగు సీజన్లకు రెండు కోట్లు.. ఐదో సీజన్ కు కోటి తగ్గించి ఒక కోటి తీసుకున్నాడట అమితాబో.. ఇక ఆరు, ఏడు సీజన్లకు 2 కోట్లు.. 8వ సీజన్ కు మూడు కోట్ల.. 9వ సీజన్ కు రెండున్నర కోట్లు తీసుకున్నారట బిగ్ బీ. ఇక 10 సీజన్ కు 3 కోట్లు తీసుకున్న బిగ్ బీ.. 11, 12, 13వ సీజన్లకు మూడు నుంచి నాలుగు కోట్లు తీసుకున్నారట. ప్రస్తుతం 14 సీజన్ కు ఎపిసోడ్ కు 4 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడట అమితాబ్. అటు మేకర్స్ కూడా బిగ్ బీ అడిగినంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారట.
ఇక మొదటి సీజన్ నుంచి.. రాణి ముఖర్జీ, పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి విద్యాబాలన్, ఆయుష్మాన్ ఖురానా, అమీర్ ఖాన్ ఈషోలో పాల్గొని ఆకట్టుకున్నారు. భారత క్రికెటర్లు సౌరబ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ సహా సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు.