నటి కార్తీక...కరోనా టైమ్ లో ట్రక్ డ్రైవర్ గా మారింది

By Surya PrakashFirst Published Jun 3, 2021, 9:16 AM IST
Highlights

మన పరిస్దితి తిట్టుకుంటూ,కరోనా ఇలా దెబ్బకొడుతోందని బాధ పడుతూ ఇంట్లో కూర్చుని సాయం కోసం ఎదురుచూడకుండా ఆమె చేస్తున్న ఈ పని చాలా మందికి స్పూర్తిగా నిలుస్తోంది.

ఆమె ఓ నటి..మళయాళంలో మక్కన, కెనరమ్ కినురమ్ వంటి కొన్ని సినిమాలు చేసింది. గుర్తింపు రాలేదు. క్లిక్ అవ్వలేదు. డబ్బు పెద్దగా వెనకేసింది లేదు. భర్త దుబాయి వెళ్లాడు. ఓ ప్రక్కన ఎనిమిదో తరగతి చదువుతున్న కొడుకు..కరోనా కాలం గడిచేదెలా..అప్పుడో నిర్ణయం తీసుకుంది..గ్లామర్ మాస్క్ తీసేసి, కరోనా మాస్క్ ముఖానికి పెట్టేసి ట్రక్ డ్రైవింగ్ మొదలెట్టేసింది.ఆమె పేరు కార్తీక. ఈ నటి ఇప్పుడు అక్కడ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 

అవును ఇప్పుడు కార్తీక..ట్రక్ డ్రైవర్ అవతారం ఎత్తి  పైనాపిల్స్‌,కొబ్బరి బొండాలు చీప్‌గా దొరికే చోటు నుంచి రేటు పలికే చోటుకు, కొబ్బరిబోండాలు ట్రాన్సపోర్ట్ చేస్తోంది. మన పరిస్దితి తిట్టుకుంటూ,కరోనా ఇలా దెబ్బకొడుతోందని బాధ పడుతూ ఇంట్లో కూర్చుని సాయం కోసం ఎదురుచూడకుండా ఆమె చేస్తున్న ఈ పని చాలా మందికి స్పూర్తిగా నిలుస్తోంది.

ఇక ఆమె ఇప్పటికిప్పుడు ట్రక్ డ్రైవింగ్ ఎలా చేస్తోంది..అనేగా మీ డౌట్. ఆమెకు చిన్నప్పుటి నుంచి డ్రైవింగ్ అంటే ఇష్టం. అందుకే ఆమె డ్రైవింగ్ నేర్చుకుని,వెహికల్ లైసెన్స్ తీసుకుంది.అయితే నటిగా ట్రైల్స్ వేయటంలో కొంతకాలం గడిచింది. మరో ప్రక్క ఎబ్రాడ్ వెళ్లి డబ్బు పంపుతున్నాడు కదా అని ఆగింది. కానీ ఇప్పుడు అన్ని చోట్లా పరిస్దితులు మారాయి. గడ్డు రోజులు స్టార్ట్ అయ్యాయి. అందుకే లారీ కొనుక్కుందిట. అయితే డబ్బులు లేక ట్రక్ తో సరిపెట్టింది. 
 
ఏదైమైనా ఎవరో వస్తారు..ఏదో చేస్తారు అని ఎదురుచూస్తూ కాలయాపన చేయకుండా తనంకంటూ ఓ జీవితాన్ని మొదలెట్టి అందరి ప్రశంసలూ పొందుతోంది. అలాగని నటిగా వెనకబడినట్లూ కాదంటోంది. మంచి ఆఫర్స్ వస్తే వెంటనే పాత్రలోకి ఎక్కేస్తా అంటోంది. ఖాకీ షర్ట్‌ ధరించి, తల మీద టోపీ పెట్టుకుని ట్రక్‌ నడిపే కార్తీకను పెద్దగా ఎవరూ గమనించకపోవటం ప్లస్ అంటోంది. 
 

click me!