లగ్జరీ కారు కొనుగోలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైన.. ధర ఎంతంటే?

By Sambi ReddyFirst Published Apr 23, 2024, 2:40 PM IST
Highlights

బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం.. 
 

ఒకప్పటి సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైన యూట్యూబ్ ద్వారా మరింత పాపులారిటీ రాబట్టింది. మంచి డాన్సర్ అయిన దీప్తి సునైన అనేక కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది. అలాగే షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు చేసింది. బిగ్ బాస్ సీజన్ 3లో దీప్తి సునైన పార్టిసిపేట్ చేసింది. హౌస్లో బాగానే రాణించింది అమ్మడు. 10 వారాలు హౌస్లో ఉంది. దీప్తి సునయన గ్లామర్, డాన్సులు హైలెట్ గా నిలిచాయి. 

ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్లు, సాంగ్స్ చేస్తుంది దీప్తి సునైన. గ్లామరస్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. కాగా దీప్తి సునైన కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. టయోటా హైలెక్స్ ని ఆమె సొంతం చేసుకున్నారు. కొత్త కారు పక్కన నిల్చుని ఫోజులిచ్చింది. సదరు ఫోటోలపై థాంక్ యూ ప్రదీప్ రెడ్డి అండ్ డాడీ అని రాసుకొచ్చింది. వారు బహుమతిగా ఇచ్చారేమో అనిపిస్తుంది. 

ఇక టయోటా హైలెక్స్  ధర రూ. 30-37 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. దీప్తి సునైనకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే దీప్తి సునైన-షణ్ముఖ్ జస్వంత్ చాలా కాలం రిలేషన్ లో ఉన్నారు. 2021 లో బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన తర్వాత దీప్తి ప్రియుడు షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో సిరి హన్మంత్ తో షణ్ముఖ్ సన్నిహితంగా ఉండటం నచ్చని దీప్తి ఈ నిర్ణయం తీసుకున్నారనే పుకార్లు వినిపించాయి. 


 

click me!