కాంగ్రెస్ పార్టీకి సతీమణితో కలసి అల్లు అర్జున్ ప్రచారం.. చూడగానే నమ్మేసేలా డీప్ ఫేక్ వీడియో

By tirumala ANFirst Published Apr 23, 2024, 10:14 AM IST
Highlights

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నాడు. అభిమానులంతా ఈ పాన్ ఇండియా చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నాడు. అభిమానులంతా ఈ పాన్ ఇండియా చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ మాస్ విశ్వరూపం ఈ చిత్రంలో ఉండబోతోందని అంచనాలు మొదలయ్యాయి. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇండియా మొత్తం సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ సెలబ్రిటీల ని టార్గెట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. అమీర్ ఖాన్, రణవీర్ సింగ్ లాంటి బడా స్టార్లని కూడా వదల్లేదు. ఇటీవల అమీర్ ఖాన్, రణ్వీర్ సింగ్ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. 

దీనితో వీళ్ళిద్దరూ కేసు నమోదు చేశారు. తాజాగా డీప్ ఫేక్ వీడియోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బలయ్యాడు. అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎలక్షన్ క్యాంపెనింగ్ లో పాల్గొన్నట్లు వీడియో సృష్టించారు. ఆయన సతీమణి స్నేహ రెడ్డిని కూడా వదల్లేదు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి కలసి కాంగ్రెస్ పార్టీకి ఓపెన్ టాప్ కారులో నిల్చుని ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది. చూడగానే బన్నీ ఏంటి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నాడు అని నమ్మేసేలా ఈ వీడియో ఉంది. 

कांग्रेस के सम्मान में अल्लू अर्जून मैदान में। pic.twitter.com/7DUvAyjbLf

— Er. Priyanka Jha (@JhaPriyankha)

కానీ అసలు వాస్తవం వేరు. గత ఏడాది అల్లు అర్జున్ తన భార్యతో కలసి న్యూయార్క్ లో ఇండియా 75వ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఆ వీడియో సహాయంతో ఇలా డీప్ ఫేక్ వీడియో సృష్టించారు. అమీర్ ఖాన్, రణ్వీర్ సింగ్ ఆల్రెడీ తమపై క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియోపై కేసు నమోదు చేశారు. మరి బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ మామగారు చంద్రశేఖర్ రెడ్డి(స్నేహ రెడ్డి తండ్రి) రాజకీయాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా బలంగా జనసేన పార్టీకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బన్నీ ఎప్పుడూ రాజకీయాల జోలికి వెళ్ళలేదు. మరి ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వెళతారేమో చూడాలి. గతంలో పవన్ భీమవరంలో పోటీ చేసినప్పుడు బన్నీ కుటుంబ సభ్యుడిగా మద్దతు తెలిపారు. 

click me!