Bigg Boss 6 Telugu Elimination: ఫైమా, శ్రీసత్య కారణంగా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ బలి.. ఈ వారం ఎలిమినేట్ అతనేనా?

Published : Nov 26, 2022, 04:32 PM ISTUpdated : Nov 26, 2022, 05:51 PM IST
Bigg Boss 6 Telugu Elimination: ఫైమా, శ్రీసత్య కారణంగా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ బలి.. ఈ వారం ఎలిమినేట్  అతనేనా?

సారాంశం

బిగ్‌ బాస్‌ 6 తెలుగు రియాలిటీ షో ఇప్పుడిప్పుడు కాస్త రసవత్తరంగా సాగుతుంది. అయితే ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఓ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ బలి కాబోతున్నారట.

బిగ్‌ బాస్‌ 6 తెలుగు రియాలిటీ షో 12వ వారం ముగింపు చేరుకుంది. ఆరో సీజన్ చివరి కెప్టెన్‌గా ఇనయ సుల్తానా ఎంపికైంది. దీంతో బిగ్‌ బాస్‌ గేమ్‌ ఛేంజర్‌గా మారిపోయింది. ఆమె కెప్టెన్‌ గెలిచిన తీరు పట్ల సర్వత్రా హర్షం, ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో బిగ్ బాస్‌ సీజన్‌ 6 టైటిల్‌ విన్నర్‌ ఆమెనే అనే కామెంట్లు ఊపందుకున్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ వారం బిగ్‌ బాస్‌ని వీడేది ఎవరనేది పెద్ద ఆసక్తికరంగా మారింది. తాజాగా 12వ వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఆ కంటెస్టెంటే ఎలిమినేట్‌ కాబోతుందంటూ కన్ఫమ్‌ చేస్తున్నారు. మరి అది ఎవరనేది చూస్తే.. 

ఈ వారం అతి తక్కువ ఓట్లు `జబర్దస్త్` కమెడియన్‌ ఫైమాకి వచ్చాయని తెలుస్తుంది. ఆ తర్వాత రాజ్‌ శేఖర్‌, అలాగే శ్రీ సత్య ఉన్నారట. అయితే ఫైమా వద్ద ఎవిక్టెడ్‌ ఫ్రీ పాస్‌ ఉంది. ఆ కార్డ్ ని ఉపయోగించుకుని ఈ వారం ఫైమా సేవ్‌ కాబోతుంది. దీంతో ఆ తర్వాత స్థానంలో రాజ్‌, శ్రీ సత్య ఉంటారని, కానీ శ్రీసత్యని సేవ్‌ చేయడంతో చివరికి రాజ్‌ ఎలిమినేట్‌ కాబోతున్నారని అంటున్నారు. 

ఈ వారం రాజ్‌ హౌజ్‌ని వీడటం కన్ఫమ్‌ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. వాళ్లకి పడ్డ ఓటింగ్‌ని బట్టి ఈ ఫలితం ఉండబోతుందని, మరి ఇదే జరుగుతుందా? చివరి నిమిషంలో ఏదైనా మార్పు ఉంటుందా? ఏవైనా ట్విస్టులుంటాయా? అనేదిచూడాలి. ప్రస్తుతం హౌజ్‌లో రేవంత్‌, ఇనయ, శ్రీహాన్‌, శ్రీ సత్య, ఫైమా, కీర్తి, రాజ్‌, ఆదిరెడ్డి, రోహిత్‌ లు ఉన్నారు. 

రాజ్‌ బిగ్‌ బాస్‌ షోలో ఓ ఇన్స్ పిరేషన్‌. జీరో నుంచి ఎదుగుతూ వస్తున్నారు. ఆయన గ్రాఫ్‌ వారం వారం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు బిగ్‌ బాస్‌ టాప్‌ కంటెస్టెంట్‌లో ఒకరిగా నిలిచారు. అతను టాప్‌ 5లో ఉంటారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా ఈ వారం రాజ్‌ ఎలిమినేట్‌ కాబోతున్నారని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas: చిరంజీవి, బాలకృష్ణకి చుక్కలు చూపించాడు.. కానీ అల్లు అర్జున్ దెబ్బకు ప్రభాస్ సినిమా అడ్రస్ గల్లంతు
Viral Song: రూ. 3 ల‌క్ష‌ల‌తో తీస్తే కోటికి పైగా వ‌చ్చాయి.. ఏకంగా బిగ్‌బాస్‌కే కార్పెట్ వేసింది. ఇదీ పాట‌కున్న శ‌క్తి