గుండెల్ని బరువెక్కించిన బిగ్ బాస్‌.. ఇనయ, బాలాదిత్య, అర్జున్‌, శ్రీహాన్‌ కన్నీళ్లు.. తనని పంపించండంటూ సూర్య..

Published : Oct 12, 2022, 11:33 PM IST
గుండెల్ని బరువెక్కించిన బిగ్ బాస్‌.. ఇనయ, బాలాదిత్య, అర్జున్‌, శ్రీహాన్‌ కన్నీళ్లు.. తనని పంపించండంటూ సూర్య..

సారాంశం

బుధవారం ఎపిసోడ్‌(38వ రోజు) లో గీతూ, అర్జున్‌, ఇనయ, బాలాదిత్యలకు అవకాశం ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఇందులో వీరంతా కన్నీళ్లు పెడుతూ, అందరిచేత కన్నీళ్లు పెట్టించారు.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 తెలుగు ఆరో వారం ఎమోషనల్‌ జర్నీలా సాగుతుంది. ముఖ్యంగా మంగళవారం నుంచి కంటెస్టెంట్లకి రీచార్జ్ చేసుకునే టాస్క్ ఇచ్చారు బిగ్‌ బాస్‌. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇచ్చిన ఈ టాస్క్ లో కంటెస్టెంట్లు బిగ్‌ బాస్‌ ఇచ్చిన మూడు ఆప్షన్లలో ఒక సర్‌ప్రైజ్‌ని మాత్రమే సభ్యుడు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంటుంది. మొదటి రోజు ఆదిరెడ్డి, శ్రీహాన్‌ వంతు పూర్తయ్యింది. 

బుధవారం ఎపిసోడ్‌(38వ రోజు) లో గీతూ, అర్జున్‌, ఇనయ, బాలాదిత్యలకు అవకాశం ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఇందులో గీతూ తన తండ్రితో ఆడియో కాల్‌ మాట్లాడే ఆప్షన్‌ తీసుకుంది. తనదైన స్టయిల్‌లో డాడీతో మాట్లాడి ఆకట్టుకుంది. ఆ తర్వాత అర్జున్‌.. శ్రీ సత్య కోసం కొన్ని చార్జ్ తగ్గించుకుని డాడీతో కేవలం వీడియో మెసేజ్‌ని పొందే అవకాశాన్ని తీసుకున్నారు. ఈ సందర్బంగా తన తండ్రి వీడియోని చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కీర్తి కూడా భావోద్వేగానికి గురయ్యింది.

ఈ క్రమంలోనే ఆర్జే సూర్య సైతంకన్నీళ్లు పెట్టుకున్నాడు. వద్దు బిగ్ బాస్‌, నన్ను పంపించేయండి అంటూ ఆయన ఎమోషనల్‌ అయ్యారు. సూర్యని ఇయన ఓదార్చడం విశేషం. ఈ ఇద్దరు చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇనయ వంతు రాగా, ఆమె కొంత సాక్రిఫైజ్‌ చేసి అమ్మా నాన్న ఉన్న ఫోటోని కోరింది. ఆ ఫోటో రావడంతో చూసుకుని ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యింది. హౌజ్‌ సభ్యుల హృదయాలను బరువెక్కించింది. 

ఆ సమయంలో బ్యాటరీ ఛార్జింగ్‌ కేవలం ఐదు శాతమే ఉంది. రీచార్జ్ చేసుకోవడానికి ఫైమాకి టాస్క్ ఇచ్చారు బిగ్‌ బాస్‌. ఆమెకి కొన్ని సినిమాలు పేర్లని ఇచ్చారు. తను ఆ సినిమా కథని ఇంగ్లీష్‌లో వివరిస్తూ ఆ పేర్లు చెప్పించాలి. దాన్ని ఇంటి సభ్యులు గెస్‌ చేయాలి. ఈ టాస్క్ లో ఫైమా తనదైన వచ్చి రాని ఇంగ్లీష్‌లో చెప్పగా, దాన్ని సభ్యులు గుర్తించారు. అందుకు 85శాతం బ్యాటరీ రీచార్జ్ పెరిగింది. 

బిగ్‌ బాస్‌ సర్‌ప్రైజ్ శ్రీ సత్య తీసుకోగా, ఆమె అమ్మతో వీడియో కాల్‌ తీసుకుంది. అందుకు 35శాతం బ్యాటరీ పోయింది. అమ్మనాన్నతో మాట్లాడుతూ శ్రీ సత్య సైతం కాస్త భావోద్వేగానికి గురయ్యింది. అనంతరం కెప్టెన్‌ అయిన రేవంత్ నిద్ర పోవడం వల్ల ఐదు శాతం కట్‌ అయ్యింది. యాభై శాతం బ్యాటరీనే ఉంది. బాలాదిత్య వంతు రాగా, ఆయన భార్యతో ఆడియో కాల్‌ మాట్లాడేందుకు తీసుకున్నారు. అందుకు యాభై శాతం ఛార్జ్ కట్‌ అయ్యింది. తన భార్య, కూతురితో మాట్లాడుతూ బాలాదిత్య ఎమోషనల్‌ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. 

అయితే బాలాదిత్య ఫస్ట్ టైమ్‌బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోయినందన గీతూకి ఇచ్చిన టాస్క్ లో భాగంగా తన సిగరేట్‌ తాగడం మానేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా బ్యాటరీ రీఛార్జ్ ఆప్షన్‌ ఉందనే విషయం శ్రీహాన్‌కి తెలియదు. ఆయన మొదటి సారి రావడంతో ఇవన్నీ తెలియదు. దీంతో సిరితో, పేరెంట్స్ తో మాట్లాడే ఆప్షన్‌ని వదులుకున్నాడు. రీఛార్జ్ ఉంటుందని తెలిస్తే తన ఆ ఆప్షన్సే తీసుకునే వాడు. ఇదే విషయాన్ని బిగ్‌ బాస్‌ని ప్రశ్నిస్తూ ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కలచి వేసింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?