ప‌వన్ కోసం మహేష్ డైరక్టర్, స్టోరీ సిట్టింగ్ ల్లో బిజీ

Published : Oct 12, 2022, 07:15 PM ISTUpdated : Oct 12, 2022, 07:16 PM IST
ప‌వన్ కోసం మహేష్ డైరక్టర్, స్టోరీ సిట్టింగ్ ల్లో బిజీ

సారాంశం

  ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా ద్వారా ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు పవర్ స్టార్. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న మూవీపై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు నెలకొన్నాయి.  

ప‌వ‌న్ క‌ల్యాణ్ తో సినిమా చేయాలని ప్రతీ డైరక్టర్ కోరిక, జీవితాశయం అన్నట్లు ఉంటారు. ఇందుకోసం చాలామంది డైరక్టర్స్, నిర్మాత‌లు కథలు తయారు చేసుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వారికి ఇబ్బందిగా మారుతోంది.  అయినా ఎవరి ఆశ వారిదే..ఎవరి ప్రయత్నాలు వారివే. ఇప్పుడు అదే క్రమంలో మహేష్ తో రీసెంట్ గా సర్కారు వారి పాట చిత్రం చేసిన పరుశురామ్ ప్రయత్నాలు మొదలెట్టారని సమాచారం.

వివరాల్లోకి వెళితే... మహేష్ తో చేసిన స‌ర్కారు వారి పాట త‌ర‌వాత‌ పెద్దగా ఆఫర్స్ రాలేదనే చెప్పాలి. ఈ సినిమా కన్నా ముందు… నాగ చైత‌న్య‌తో ఓ సినిమా కమిటయ్యి ఉన్నాడు. అందుకోసం `నాగేశ్వ‌ర‌రావు` అనే టైటిల్ తో ఓ క‌థ రాసాడు ప‌ర‌శురామ్. కానీ.. ఊహించని విధంగా నాగచైతన్యతో ..వెంక‌ట్ ప్ర‌భు సినిమాని ప‌ట్టాలెక్కించాడు. దాంతో  ప‌ర‌శురామ్ కు గ్యాప్ వచ్చింది. దాంతో పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామని ప్రయత్నాలు మొదలెట్టారని సమాచారం. ఈ మేరకు తన టీమ్ తో కలిసి స్టోరీ లైన్ పై డిస్కషన్స్ మొదలెడుతున్నట్లు తెలుస్తోంది. 

ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆయన గతంలో  ప‌ర‌శురామ్ కి అడ్వాన్స్ ఇచ్చారు. ఆయ‌న ద‌గ్గ‌ర ప‌వ‌న్ క‌ల్యాణ్ డేట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో  ప‌ర‌శురామ్ తో ఓ క‌థ రెడీ చేసి పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నట్లు టాక్‌. ప్ర‌స్తుతం స్టోరీ డిస్కషన్స్  జ‌రుగుతున్నాయి.పూర్తి  క‌థ రెడీ అయ్యాక‌….అది ప‌వ‌న్ కి వినిపించి, ఆయనకు న‌చ్చితే , ప‌ట్టాలెక్కించే అవకాసం ఉంది.

అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. రాజకీయాలపై పూర్తి దృష్టి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు పవన్. దీంతో తమ హీరోని బిగ్‌ స్క్రీన్లపై మళ్లీ చూడలేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే మూడేళ్ల గ్యాప్ తరువాత 'వకీల్ సాబ్‌' సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ ఏడాది రిలీజ్ అయిన భీమ్లా నాయక్ మూవీ  బాగానే వర్కవుట్ అయ్యింది. ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా ద్వారా ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు పవర్ స్టార్. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న మూవీపై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు నెలకొన్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?