ఆల్రెడీ ఎలిమినేట్ అయిన సభ్యుల్లో ఒకరిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.సీజన్ 1లో కూడా ఇలానే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ను హౌస్ లోకి తిరిగి తీసుకొచ్చారు
బిగ్ బాస్ రెండో సీజన్ రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షో శని, ఆదివారాలతో పాటు వీక్ డేస్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ఈ షో నుండి ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.
అయితే శ్యామల, భానుశ్రీల ఎలిమినేషన్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. ఈ షో హైదరాబాద్ లో నిర్వహిస్తుండడంతో కొంత కీలక సమాచారం బయటకు లీక్ అవుతోంది. ఈ సమయంలో షో మీద మరింత ఆసక్తిని పెంచేందుకు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన సభ్యుల్లో ఒకరిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.సీజన్ 1లో కూడా ఇలానే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ను హౌస్ లోకి తిరిగి తీసుకొచ్చారు.
అయితే సెకండ్ సీజన్ లో మాత్రం ఎలిమినేట్ అయిన అయిదుగురికి పోల్ పెట్టి అందులో ఒకరిని ఇంటిలోకి ఆహ్వానించనున్నట్లు టాక్. అయితే వీరిలో భాను లేదా శ్యామల హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి!