మరో రెండు రోజుల్లో బిగ్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్న `కేజీఎఫ్‌ఃఛాప్టర్‌2` టీమ్‌

Published : Dec 19, 2020, 01:26 PM IST
మరో రెండు రోజుల్లో బిగ్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్న `కేజీఎఫ్‌ఃఛాప్టర్‌2` టీమ్‌

సారాంశం

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బిగ్‌ న్యూస్‌ రాబోతుంది. ఈ నెల 21న బిగ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇయర్‌ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. 

యశ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2`. సంచలన విజయం సాధించిన `కేజీఎఫ్‌`కిది రెండో భాగం. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బిగ్‌ న్యూస్‌ రాబోతుంది. ఈ నెల 21న బిగ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇయర్‌ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. 

ఇందులో `ఫైనల్లీ ఆ రోజు రాబోతుంది. `కేజీఎఫ్‌2` చివరి దశకు చేరుకుంది. ఈ నెల 21 వండర్‌ఫుల్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నాం. ఇన్ని రోజులు వెయిట్‌ చేసినందుకు ధన్యవాదాలు` అని తెలిపారు. అయితే ఈ సినిమా నుంచి ఏం రాబోతుంది, ఏ విషయాన్ని చెప్పబోతున్నారనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. సినిమా విడుదల తేదీ, టీజర్‌ రిలీజ్‌తోపాటు యష్‌ ఫస్ట్ లుక్‌ వంటి వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉందని టాక్‌. ఇదిలా ఉంటే ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. యష్‌, సంజయ్‌ దత్‌ వంటి ప్రధాన తారాగణం ఇందులో పాల్గొన్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరంగుదూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా