బిగ్ బాస్ హౌస్ లో మరో చిచ్చు పెట్టిన నాగార్జున, కలిసిమెలిసి ఉన్న కంటెస్టెంట్స్ మధ్య మళ్ళీ గొడవలు

By Mahesh JujjuriFirst Published Dec 10, 2022, 10:56 PM IST
Highlights

బిగ్ బాస్ హౌస్ లో మరో చిచ్చు పెట్టాడు కింగ్ నాగార్జున. చివరి వారానికి వస్తుండగా.. అంతా కలిసిపోయి ఆట ఆడుతున్న కంటెస్టెంట్స్ మధ్య అగ్గిరాజేశాడు నాగ్. 
 

గేమ్ చివరి దశకు వస్తుంది. బిగ్ బాస్ హౌస్ సీజన్ 6 లో ఈ వారం ఇంకా 7 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈవారం ఒకరు ఎలిమినేట్ అయితే.. ఇంకా 6 మెంబర్స్ ఉంటారు. ఇక ఈవారం అంతా కలిసి మెలిసి ఉన్నారు ఇంటి సభ్యులు. గేమ్ లో కాస్త చురుకు తెప్పిచాలి అనుకున్నారో లేకు.. వారి ఓపికకు పరీక్ష పెట్టాలీ అనుకున్నాడో తెలియదు కాని. శనివారం సరదాలతో పాటు.. ఇంట్లో అందరి మధ్య గొడవలు పెట్టేలా టాస్క్ లు ఆడించడా కింగ్ నాగార్జున. 

ఈక్రమంలో వచ్చి రావడమే.. ఇద్దరు ఇద్దరిని ఎవరు బెస్ట్.. ఎందుకు ఎదుటివారు  వరస్ట్ అని చెప్పాలంటూ.. చిన్న టాస్క్ పెట్టాడు నాగ్. ఈక్రమంలో అప్పటి వరకూ మంచిగా ఉన్నవారి గురించి.. తనకంటే తక్కువ చేసి మాట్లాడటం ఎలా అంటూ అందరూ మదన  పడుతూనే ఎవరికి వారు రీజన్స్ చెప్పేశారు. శ్రీహాన్- రేవంత్,  కీర్తి - శ్రీసత్య,  ఆదిరెడ్డి -ఇనయ, రోహిత్- రేవంత్ మధ్య ఈ టాస్క్ జరిగింది. అప్పటికే ఇంట్లో వాళ్ల ముఖాలు మారిపోయాయి. 

ఆతరువాత స్టార్స్ టాస్క్ లో కూడా ఇదే ఫార్ములా వాడారు నాగ్.  ఫస్ట్ టాస్క్ లో ఓపెన్ అవ్వలేదు ఎవరూ.. అని అభిప్రాయ పడ్డ బిగ్ బాస్.. మరో టాస్క్ తో వారిలోని ఫైర్ ను బయటకు తీయ్యాలి అనుకున్నాడు. దాని వల్ల ఒకరి మధ్య మరొకరికి మనస్పర్థలు వస్తాయి అని తెలిసినా..స్టార్ గేమ్ ఆడించి.. అందరిలో కాస్త  చురుకు తెప్పించాడు. ఈగేమ్ లో అందరికంటే ఎక్కువగా మైనస్ వచ్చి ఇనయా, కీర్తి, ఆదిరెడ్డి ఉన్నారు. వారిలో ఏం మార్చుకోవాలో ఆలోచించుకోమన్నారు నాగ్. ఇక అయినా కిక్కు చాలని నాగార్జున.. చివరిగా మరో ట్విస్ట్ చూపించారు. 

చివరిగా శ్రీహాన్ తో పాటు కీర్తి, రేవంత్ లను ఈవారం ఎవరు బయటకు వెళ్తారు అని అనుకుంటూన్నారు అని అడిగారు నాగార్జున. ఈక్రమంలో శ్రీహాన్ బలవంతంగా చెప్పలేక చెప్పలేక రోహిత్ పేరు చెప్పగా.. కీర్తి కూడా మోహమాటానికి ఆదిరెడ్డి పేరు చెప్పింది. ఇక రేవంత్ ఇనయా పేరు చెప్పగా... వారి మధ్య కొద్ది సేపు వాదన జరిగింది ఇక ఆరువాత ప్రైజ్ మనీ లో మిగిలిన బ్యాలెన్స్ పెంచుకోవడం కోసం ఏకాబ్రిప్రాయంతో తన దగ్ర ఉన్న బాక్సుల్లో ఒకటి సెలక్ట్ చేసుకోవల్సిందిగా నాగ్ అడిగారు . అందరూ ఒక బాక్స్ , రేవంత్ మరో బాక్స సెలక్ట్ చేసుకోగా.. ఏకాబిప్రాయం బాక్స్ ద్వారా ఫ్రైజ్ మనీ లోటు తీరిపోయింది. ఇక మారుతీ నుంచి విన్నర్ ఒక కారు గెలుచుకోబోతున్నట్టు కూడా ప్రకట చేశారు. 
 

click me!