ప్రభాస్ ను కలిసిన ప్రముఖ నిర్మాత.. వైరల్ అవుతున్న ఫొటో.. ఇంతకీ విషయం ఏంటీ?

By team teluguFirst Published Dec 10, 2022, 6:50 PM IST
Highlights

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ నిర్మాత మీటింగ్ ఆసక్తికరంగా మారింది. ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటూ వస్తున్న డార్లింగ్ బిజీ షెడ్యూల్ తో ఉన్నారు. ఈ క్రమంలో వీరి మీటింగ్ హాట్ టాపిక్ గా మారింది. 
 

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. బిజీ షెడ్యూల్ తో ప్రభాస్ ఇప్పటికే సెట్స్ పైన ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ప్రొడ్యూసర్ డార్లింగ్ ను ప్రత్యేకంగా కలవడం ఆసక్తికరంగా మారింది. చివరిగా ‘రాధే శ్యామ్’తో అప్సెట్ చేసిన డార్లింగ్ ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. శరవేగంగా చిత్రాలను పూర్తి చేస్తున్నారు.

కాగా, మరో ప్రాజెక్ట్ ను ప్రభాస్ ఓకే చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) ప్రభాస్ ను కలవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ‘ప్రభాస్ ను కలవడం సంతోషంగా ఉంది. సినిమాల గురించి మరియు మరిన్నింటి విషయాలపై సంభాషణలు కొనసాగాయి.’ అంటూ ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు.  ఇప్పటికే ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ పై హిట్ చిత్రాలను నిర్మిస్తుండగా.. ప్రభాస్ ను ప్రత్యేకంగా కలవడంతో నెక్ట్స్ ప్రభాస్ తో సినిమా చేస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై క్లారిటీ రావాలంటే మరింత సమయం పడుతుంది. 

ఇదివరకే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంతో నిర్మించిన ‘ఆదిపురుష్’(Adipurush) చిత్ర షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ హిందూ మైథలాజికల్ ఫిల్మ్ లో ప్రభాస్ - క్రితి సనన్ జంటగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పార్లల్ గా Salaar, Project K చిత్రాలను కూడా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఎలాంటి అప్డేట్ లేకుండా క్రియేటివ్ దర్శకుడు మారుతీ డైరెక్షన్ లోనూ నటిస్తున్నట్టు తెలుస్తోంది. కామెడీ జోనర్ లో  సినిమా రూపొందుకుంటుందని, ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తై.. రెండ్రోజుల కింద రెండో షెడ్యూల్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మొత్తంగా వచ్చే ఏడాది వరకు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత సినిమాల కోసం ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

 

click me!