కత్తి మహేష్ కు పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ..మంట పెట్టేశారు

Published : Aug 23, 2017, 07:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
కత్తి మహేష్ కు పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ..మంట పెట్టేశారు

సారాంశం

బిగ్ బాస్ షోతో సెలెబ్రిటీగా మారిపోయిన కత్తి మహేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రాజకీయాలపై మహేష్ కత్తి విమర్శలు ఆగ్రహంతో మహేష్ కత్తిని తెగ ట్రోలింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు

‘బిగ్ బాస్’ షోలో పాల్గొన్న తరువాత  సినిమా విమర్శకుడు మహేష్ కత్తి సెలెబ్రెటీగా మారిపోయాడు.  ‘బిగ్ బాస్’ షో ముందు వరకు సినీ ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రమే మహేష్ కత్తి పేరు తెలుసు. అయితే  ‘బిగ్ బాస్’ హౌస్ లోకి అడుగుపెట్టి, షో నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ఇతడు సెలబ్రిటీగా మారిపోవడమే కాకుండా చాలా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రస్తుతం బిజీగా గడుపుతున్నాడు. మహేష్ కత్తి ప్రస్తుతం ఏమి చెప్పినా అది సంచలన వార్తగా మారుతోంది. 

 

ఈ నేపధ్యంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. ‘జనసేన’ అధినేతగా పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహార శైలిపై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కేవలం ట్వీట్స్ కు, బహిరంగ సభలకే పరిమితం అవుతున్నాడు అంటూ మరో వివాదానికి తెరతీసాడు.

 

ప్రస్తుతం పవన్ ప్రశ్నించడం తప్పించి సమస్యల పట్ల తన అభిప్రాయాన్ని చెప్పకుండా ఆ సమస్యలకు పరిష్కారాలను చెప్పకుండా వ్యవహరిస్తున్న తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు మహేష్ కత్తి అభిప్రాయ పడుతున్నాడు.

 

అసలు పవన్ సోషల్ మీడియాలో స్పందించే విధానం కంటే తాను తన ఫేస్ బుక్ లో అనేక సమస్యల పై ఎంతో ఎక్కువగా వ్రాస్తున్నానని అయితే కేవలం సమస్యల పై మాట్లాడినంత మాత్రాన తనను కూడ ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ తన పై తాను జోక్ వేసుకుని పవన్ పై సెటైర్ వేస్తున్నాడు కత్తి మహేష్. 

 

పవన్ ఒక రోజు చెప్పిన మాటలకు రెండో రోజు చెప్పిన మాటలకే పొంతన ఉండడం లేదు లేదు అంటూ కత్తి మహేష్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.  ఒక రాజకీయ పార్టీ పెట్టినపుడు ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాడాలి గానీ కేవలం గతంలో ‘లోక్ సత్తా’ అధినేత జయప్రకాష్ నారాయణ్ స్పందించిన విధంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ టైం పాస్ కోసం రాజకీయాలు చేస్తున్నాడు అంటూ ఈ ఫిలిం క్రిటిక్ చేసిన కామెంట్స్ పవన్ అభిమానులలో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో కత్తి మహేష్ పై ట్రోలింగ్ కూడా తీవ్రతరం అయింది. మనకెందుకు.. అనుకోకుండా పెన్నూ.. ఫోనూ వుందని తోసింది రాస్తే.. ట్రోలింగ్ తగలడం కూడా అంతే కామనైంది.

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్‌⁠లు ఇవే.. సంచలనం సృష్టించిన చిన్న సినిమా, తప్పక చూడాల్సిన థ్రిల్లర్స్ రెడీ
Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే