బాహుబలి చైనా రిలీజ్ కు లభించని అనుమతి

Published : Aug 23, 2017, 06:59 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
బాహుబలి చైనా రిలీజ్ కు లభించని అనుమతి

సారాంశం

చైనాలో బాహుబలి సినిమా విడుదలకు తహతహలాడుతున్న టీమ్ చైనా సర్కారు అనుమతి లభించకపోవడంతో కలవరం దంగల్ రికార్డు బ్రేక్ చేస్తుందని బాహుబలిపై భారీ అంచనాలు

భారత దేశ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టించిన బాహుబలి దేశీయ మార్కెట్ లో దాదాపుగా 1600 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన “బాహుబలి 2” సినిమాను సెప్టెంబర్ లో చైనాలో విడుదల చేసి, కనివినీ ఎరుగని రికార్డులను కైవసం చేసుకోవాలని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

 

బయటకు వెల్లడించనప్పటికీ, అమీర్ ఖాన్ “దంగల్” సృష్టించిన కలెక్షన్ల ప్రభంజనం రీత్యా, ‘బాహుబలి 2’ కూడా అదే స్థాయిలో గానీ, అంతకు మించి గానీ వసూలు చేస్తే… ఊహకందని రికార్డులు మన తెలుగు సినిమా సొంతమవుతాయనే స్వార్ధం అందరిలోనూ ఉంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అనుమతులు రాకపోవడం కలవరపెడుతోంది. చైనాలో రిలీజ్ చేయాల్సిందిగా ఇండియన్ ఫార్మాలిటిస్ అన్ని పూర్తయినప్పటికీ, చైనా ప్రభుత్వం నుండి విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో.., అసలు రిలీజ్ అవుతుందా? ఒకవేళ రిలీజ్ అయితే సెప్టెంబర్ లో సాధ్యమేనా? లేక ఇంకాస్త సమయం పడుతుందా? ఇలా దేనిపైన స్పష్టత లేకుండా ఉంది.

 

‘బాహుబలి 2’ యూనిట్ అయితే ‘దంగల్’ రికార్డులను అధిగమించి, 3000 కోట్ల క్లబ్ లో చేరాలని ఊవ్విళ్ళూరుతోంది. ఒకవేళ అది సాధ్యం కాకపోయినా… ఓవరాల్ గా ఇండియా, చైనాలో కలిపి 2000 కోట్ల క్లబ్ లో చేరడం అయితే గ్యారెంటీ కావడంతో, ‘బాహుబలి 2’ రిలీజ్ కోసం యూనిట్ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో పలు ఇంటర్వ్యూలలో చైనా విడుదల గురించి రాజమౌళి మాట్లాడుతూ… చైనా మార్కెట్ లో స్క్రీన్స్ లభించడం చాలా ముఖ్యమని, ‘బాహుబలి 2’ సినిమాకైతే తగినన్ని స్క్రీన్స్ దొరికినప్పుడే రిలీజ్ చేస్తామని, తన అంచనా ప్రకారం స్క్రీన్స్ లో పెద్దగా ఇబ్బందులు కావని అన్నారు.

 

కానీ, ఇలా అనుమతులు లభించడంలో సంక్లిష్టత ఏర్పడుతుందని మాత్రం ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. ఓ పక్క తదుపరి ప్రాజెక్టుకు రెడీ అవుతున్న రాజమౌళికి చైనా రిలీజ్ గుదిబండలా మారుతోందని తెలుస్తోంది. మరి చైనా రిలీజ్ కు అనుమతి లభిస్తుందా లేదా అనేది చూడాలి.

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం