బిగ్ బాస్ 2: మల్టీస్టారర్ లో ఛాన్స్ కొట్టేసిన కంటెస్టెంట్!

Published : Oct 14, 2018, 12:43 PM IST
బిగ్ బాస్ 2: మల్టీస్టారర్ లో ఛాన్స్ కొట్టేసిన కంటెస్టెంట్!

సారాంశం

ఇటీవల కాలంలో కొంత మంది నటీనటులు వారి క్రేజ్ ను పెంచుకోవడానికి రియాలిటీ షోలను ఆధారంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా బిగ్ బబాస్ ను ఎక్కువగా ఉపయోగపడుతోంది. 

సినిమా అవకాశం రావాలంటే -కష్టపడే గుణంతో పాటు కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. ఇక అవకాశం వచ్చినప్పుడే టాలెంట్ నిరూపించుకొని స్టార్ గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేయాలి. ఇటీవల కాలంలో కొంత మంది నటీనటులు వారి క్రేజ్ ను పెంచుకోవడానికి రియాలిటీ షోలను ఆధారంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా బిగ్ బబాస్ ను ఎక్కువగా ఉపయోగపడుతోంది. 

బిగ్ బాస్ ద్వారా ఏ మాత్రం క్రేజ్ వచ్చినా వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల అందరికంటే ఎక్కువగా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ అవకాశాలు దక్కించుకుంటోంది. తమిళ్ బిగ్ బస్ 2 కంటెస్టెంట్ విజయలక్ష్మి చక్కని అభినయంతో అందరికి ఆకర్షించింది. దీంతో ఆమె హౌస్ నుంచి అడుగు బయటపెట్టగానేవరుసగా అవకాశాలు వస్తున్నాయి. 

అంతకుముందే కొన్ని సినిమాల్లో నటించిన విజయలక్ష్మి అప్పుడు పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఒక మంచి మల్టీస్టారర్ కథలో అమ్మడికి ఛాన్స్ వచ్చింది. శింబుదేవన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక మల్టీస్టారర్ కథలో వెంకట్‌ ప్రభు, మిర్చి శివ, జై, ప్రేమ్‌జీ అమరన్‌, వైభవ్‌, అజయ్‌రాజ్‌ లు నటించనున్నారు. అయితే ఈ సినిమాలో తాను కూడా భాగం కానున్నట్లు విజయలక్ష్మి తెలిపింది. మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ జననికి కూడా ఈ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కింది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్