సైరాకు షాకిచ్చిన బిగ్ బి.. క్లారిటీ ఇచ్చిన పీఆర్వో

Published : Jan 28, 2018, 05:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
సైరాకు షాకిచ్చిన బిగ్ బి.. క్లారిటీ ఇచ్చిన పీఆర్వో

సారాంశం

మెగాస్టార్ 151వ చిత్రంలో అమితాబ్ అమితాబ్ తప్పుకున్నాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు అవన్నీ తప్పని, తదుపరి షెడ్యూల్ లో అమితాబ్ తో షూటింగ్ అన్న పీఆర్వో

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన  పాత్రలో సురెందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. దాదాపు పదేళ్ల విరామంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు ఖైదీ నంబర్‌ 150 మూవీతో హిట్ కొట్టారు. ఏడాది విరామం తీసుకున్న చిరు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ రూమర్  చక్కర్లు కొడుతోంది.



ఈ సినిమా నుంచి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తప్పుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ప్రధాన మీడియాకు చెందిన వెబ్‌సైట్లు కూడా బిగ్‌బి తప్పుకున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నట్లు వార్తలు రాశాయి. ఈ విషయమై కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ డిజిటల్ పీఆర్వో స్పందించారు. బిగ్ బి తప్పుకున్నారనే వార్తలు నిరాధారమని చెప్పారు. తర్వాతి షెడ్యూల్స్‌లో ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని స్పష్టం చేశారు.



సైరా సంగీత దర్శకత్వ బాధ్యతల నుంచి ఏఆర్ రెహ్మాన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. తర్వాత సినిమాటోగ్రాఫర్ కూడా మారడంతో ఈ తాజా రూమర్ కూడా నిజమేనని చాలా మంది నమ్మారు. ఫిబ్రవరిలో సైరా రెండో షెడ్యూల్‌ షూటింగ్ ప్రారంభం కానుంది.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..