`భోళాశంకర్‌` ట్రైలర్..మెగా ఫెస్టివల్‌ షురూ.. బ్యాక్ టూ బ్యాక్ అన్నాదమ్ముల రచ్చ..

ఇప్పటికే మెగా సందడి ప్రారంభమైంది. ఇక మరో నాలుగు రోజుల నుంచి మెగా ఫెస్టివల్‌ షురూ కాబోతుంది. చిరంజీవి నటించిన `భోళా శంకర్‌` ట్రైలర్‌ అప్ డేట్‌ ఇచ్చింది యూనిట్‌.

Google News Follow Us

మెగాస్టార్‌ మరోసారి సందడి చేయడానికి వస్తున్నారు. ఆయన ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి `వాల్తేర్‌ వీరయ్య`తో ఫ్యాన్స్ కి మాత్రమే కాదు బాక్సాఫీసుకి కూడా పూనకాలు తెప్పించారు. ఈ సినిమా రూ.250కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. నిర్మాతలకు దాదాపు యాభై కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరోసారి రచ్చ చేసేందుకు వస్తున్నారు మెగాస్టార్‌. ప్రస్తుతం ఆయన `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించారు మేకర్స్. మూడు పాటలు విడుదల చేశారు. టీజర్‌తో అదరగొట్టారు. ఇప్పుడు మరో అప్‌డేట్‌ వచ్చింది. ట్రైలర్ టైమ్‌ వచ్చింది. ఈ నెల 27న `భోళాశంకర్‌` ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు టీమ్ తెలిపింది. మరో నాలుగు రోజుల్లో మెగా ఫెస్టివల్‌ ప్రారంభం కాబోతుందని యూనిట్‌ తెలిపింది. 

మాస్‌ యాక్షన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు మెహర్‌ రమేష్‌. ఇది తమిళంలో విజయం సాధించిన `వేదాళం` చిత్రానికి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తిసురేష్‌ చెల్లి పాత్ర పోషిస్తుంది. అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కాబోతుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమాని రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాల జోరుపెంచారు. ఇక ట్రైలర్‌ అది మరింత పెరగబోతుంది. 

అయితే బ్యాక్‌ టూ బ్యాక్‌ మెగా బ్రదర్స్‌ రచ్చ చేయబోతున్నారు. నిన్న శనివారం పవన్‌ కళ్యాణ్‌ నటించిన `బ్రో` ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రెండు రోజుల్లో `బ్రో` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో `భోళాశంకర్` ట్రైలర్‌ రానుంది. ఆ నెక్ట్స్ డేనే `బ్రో` సినిమా రిలీజ్‌ కానుంది. ఆ తర్వాత వరుసగా చిరంజీవి ప్రమోషన్స్ లో సందడి చేయనున్నారు. మధ్యలో ఒక్క వారం గ్యాప్ తో `భోళాశంకర్‌` రానుంది. ఇలా మెగా ఫెస్టివల్‌ షురూ కాబోతుందని చెప్పొచ్చు. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...