
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కు గొప్ప పేరుంది. ఆయన డైరెక్షన్ కాని.. ఆయన చేసిన సినిమాలు కాని ప్రత్యేక శైలిని కలిగి ఉంటాయి. ఆ దర్శకుడి నుంచి వచ్చిన తాజా సినిమా ఓపెన్ హైమర్. అమెరికా శాస్త్రవేత్త, అణుబాంబు పితామహుడు అయిను ఓపెన్ హైమర్ పేరుతోనే ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు నోలన్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదనిపిస్తోంది. యావరేజ్ టాక్ తో నడుస్తోంది.అయితే తాజాగా ఈ సినిమాపై కొత్త వివాదం చెలరేగింది. ఒపెన్ హైమర్ మూవీ ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడింది. మూవీలో భగవద్గీతను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని..అందుకే ఈ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని హిందూ సంఘాలకు చెందిన కొంత మంది డిమాండ్ చేస్తున్నారు.
ఈ సినిమా విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ పై హిందూ గ్రంథాల ప్రభావం చాలా ఉంది. ఆయన తన జీవిత కాలంలో భగవత్ గీతతో పాటు.. పలు పురాణాలు చదివారు. దాంతో ఓపెన్ హైమర్ సినిమాపై కూడా భగద్గీత ప్రభావం చాలా ఉంది. సినిమా చూస్తుంటే అది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అసలు వివాదం ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే.. మూవీలోని ఒక సీన్ లో ఫ్లోరెన్స్ పగ్ పాత్రధారి జీన్ టాట్ లాక్, ఓపెన్ హైమర్ మధ్య బోల్డ్ సీన్స్ ఉన్నాయి. వారిద్దరి మధ్య వచ్చే శృంగార సన్నివేశంలో నటి భగద్గీత చదువుతున్నట్టుగా చూపించారు.ఇక్కడే అసలు వివాదం రాజుకుంది. దీనిపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ వివాదంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది.
ఇక ఈ విషయంలో నెటిజన్లు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. రకరకాలుగా స్పందిస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. దర్శకుడు నోలన్ తన సినిమాలో భగవద్గీత గురించి ప్రస్తావించడం బాగుంది, కానీ ఇలా శృంగార సన్నివేశాల టైమ్ లో.. హిందూవుల పవిత్ర గ్రంథం భగవద్గీత గురించి చూపించడం సరికాదని అంటున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ సన్నివేశాలను తొలగించాలని, మూవీను ఇండియాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఈసినిమాపై రచ్చ ఎంత వరకూ వెళ్తుదో చూడాలి. ఈసినిమాను ఇండియాలో బ్యాన్ చేస్తారా.. దర్శకుడు ఈసినిమాలో ఆ సన్నివేశాన్ని తొలగిస్తారా..? అసలు ఈ విషయంలో వారు ఏమని స్పందిస్తారో అని అంతా ఉత్కంటగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కి మంచి పేరు ఉంది. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో బ్యాట్ మ్యాన్ బిగిన్స్, ది డార్క్ నైట్, ది డార్క్ నైట్ రైజెస్, డంకర్క్ లాంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఇండియాలోనూ నోలన్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మరి ఆయన ఈ వియంలో ఏం స్పందిస్తారో చూడాలి.