ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. ఫైనల్ డిజాస్టర్ గా మిగిలింది. ఫస్టాఫ్ ఓకే అనుకున్నా సెకండాఫ్ చూడటం కష్టం అని తేల్చేసారు.
అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. ఫైనల్ డిజాస్టర్ గా మిగిలింది. ఫస్టాఫ్ ఓకే అనుకున్నా సెకండాఫ్ చూడటం కష్టం అని తేల్చేసారు.ఎవరేమన్నా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. అయితే రెండో రోజు నుంచే డ్రాప్ స్టార్ట్ అయ్యింది. తర్వాత దారుణం అయ్యింది. ఈ క్రమంలో నెగిటివ్ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవటంతో వీకెండ్ చూద్దామనుకున్న వాళ్లు కూడా ఆగిపోయారు. చాలా మంది ఓటిటిలో చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఓటిటిలో రిలీజ్ డేట్ పై అఫీషియల్ ప్రకటన వచ్చింది.
అఖిల్ ఏజెంట్ మూవీ మే 19న సోనిలివ్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేసింది. తాజాగా అయితే ఆ డేట్ కు ఓటిటిలో రిలీజ్ కాలేదు. ఎందుకనేది ఎవరికి అర్దం కాలేదు. ఆ తర్వాత అబ్బే ఓటిటికు వేరే వెర్షన్ రెడీ చేస్తున్నారు అన్నారు. అది జరగే పనికాదని నిర్మాత తేల్చేసారు. ఈ క్రమంలో అసలు ఈ సినిమా ఓటిటి రిలీజ్ పూర్తిగా ఆపేసారనే వార్త మీడియా సర్కిల్స్ లో వినపడుతోంది. రషెష్ ఇస్తే రీఎడిట్ వెర్షన్ తో రిలీజ్ చేస్తే ఓటిటిలో జనం చూస్తారని సోనీ లైవ్ వాళ్లు ప్రపోజల్ పెట్టారని, అది కుదరే పని కాదని నిర్మాత చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజమెంత అనేది తెలియదు.
కానీ ఇప్పుడిప్పుడే ఓటిటిలో ఈ సినిమా వచ్చే అవకాసం లేదంటున్నారు. థియేటర్ లో అంత దారుణంగా రిజెక్ట్ అయిన సినిమా ఓటిటిలో మాత్రం చూస్తారా అని అనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇది సోనీ లివ్ టీమ్ కు పెద్ద దెబ్బ అని అంటున్నారు. అంత డబ్బు పెట్టి ఓటిటి రైట్స్ తీసుకుని ప్రక్కన పెడితే దాని ఇంపాక్ట్ మిగతా సినిమాల కొనుగోలు పై ఖచ్చితంగా పడుతుంది అంటున్నారు.ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనిలివ్ 11 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కేవలం ఆరు కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇందులో మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్రను పోషించగా సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు.
చిత్రం కథేమిటంటే..
రామకృష్ణ అలియాస్ రిక్కీ అలియాస్ వైల్డ్ (అక్కినేని అఖిల్) కి ఒకటే జీవితాశయం. అది ఇంజిలిజెంట్ వింగ్ అయిన రా ఏజెంట్ అవ్వాలని.ఆ క్రమంలో తాను రా ఏజెంట్ అవ్వడానికి చేసే ప్రతీ ప్రయత్నం ఫెయిల్ అవుతూంటుంది.చివరగా తన అతి తెలివి ను ఉపయోగించి 'రా' చీఫ్ డెవిల్ అలియాస్ మహాదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్స్ ని హ్యాక్ చేసి అతని దృష్టిలో పడతాడు. ఆ సమయంలో డెవిల్...ఓ స్పై ఆపరేషన్ సన్నాహాల్లో ఉంటాడు. గాడ్ అలియాస్ ధర్మ (డినో మోరియా) దేశానికి వినాశనంగా తయారయ్యాడని అతన్ని కంట్రోలు చేసేందుకు తన ఏజెంట్స్ ని పంపుతూంటాడు. కానీ వాళ్లెవరూ సక్సెస్ కారు. అప్పుడు డెవిల్ కు ఓ ఆలోచన వస్తుంది. దాదాపు కోతిలా ఎప్పుడు అల్లరి చేస్తూ స్పై అవ్వాలనే ఆలోచనలో ఉన్న రిక్కీని ... స్పైగా ..గాడ్ ని నాశనం చేయటానికి పంపుతాడు. ఆ మిషన్ లో రిక్కీ సక్సెస్ అయ్యాడా..అసలు స్పై అవ్వాలని రిక్కీ అలోచనల వెనక అసలు కథేంటి... డెవిల్ గాడ్ మధ్యలో ఎవరు గెలిచారు? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..