`భోళాశంకర్‌` నుంచి ఫస్ట్ సాంగ్‌ ప్రోమో.. ఓపెనింగ్‌ అదిరింది.. కానీ

Published : Jun 02, 2023, 07:02 PM IST
`భోళాశంకర్‌` నుంచి ఫస్ట్ సాంగ్‌ ప్రోమో.. ఓపెనింగ్‌ అదిరింది.. కానీ

సారాంశం

చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా `భోళాశంకర్‌` విడుదలకు మరో రెండు నెలలుంది. ప్రమోషనల్‌ కార్యక్రమాలు మాత్రం అప్పుడే స్టార్ట్ చేసింది యూనిట్‌. తాజాగా ఫస్ట్ సాంగ్‌ ప్రోమోని విడుదల చేశారు.  

మెగాస్టార్‌ చిరంజీవి త్వరలో మరో సినిమాతో రాబోతున్నారు. ఆయన ఇప్పుడు `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా మరో రెండు నెలల్లో రిలీజ్‌ కాబోతుంది. ఇప్పటికే సంక్రాంతికి `వాల్తేర్‌ వీరయ్య` సినిమాతో రచ్చ చేసిన చిరంజీవి ఇప్పుడు `భోళాశంకర్‌`తో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమాలు షురూ చేశారు. సినిమా నుంచి తొలి సాంగ్‌ `భోళా మానియా` ని రిలీజ్‌ చేయబోతున్నారు. తాజాగా పాట ప్రోమోని విడుదల చేశారు. జస్ట్ మ్యూజిక్‌తోనే ఈ ప్రోమో ఉంది. 

అయితే ఈ ప్రోమో ఇంట్రో అదిరింది.ఆ తర్వాత సౌండ్‌ క్లారిటీ లేదు. మెగాస్టార్‌ సినిమా పాటకి ఉండాల్సిన సౌండింగ్‌ లేదు. ఆ కిక్‌ మిస్‌ అయ్యింది. `వాల్తేరు వీరయ్య`లో పూనకాలు లోడింగ్‌ లాంటి పాటలు చూసిన ఫ్యాన్స్ కి ఈ సౌండింగ్‌ ఆనడం లేదని చెప్పాలి. ఆశించిన కిక్‌ ఈ ప్రోమోలో లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. పూర్తి పాటని ఈ నెల 4న  రిలీజ్‌ చేయబోతున్నారు. ఫుల్‌ సాంగ్‌తో ఆ డిజప్పాయింట్‌మెంట్‌ని పుల్‌ఫిల్‌ చేస్తారేమో చూడాలి. 

ఇక మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుంది. `సైరా`లో కీలక పాత్రలో నటించిన తమన్నా ఇందులో పూర్తి స్థాయిలో ఆయనకు జోడీగా మెరవబోతుంది. మరోవైపు కీర్తిసురేష్‌ సైతం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. చిరుకి ఆమె చెల్లిగా కనిపించబోతుంది. ఆల్మోస్ట్ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కాబోతుంది. దీంతో ఈ ఏడాది మరో హిట్‌కి రెడీ అవుతున్నారు చిరంజీవి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?