యాక్సిడెంట్ లో నటి మనీషా మృతి!

Published : May 21, 2018, 02:05 PM IST
యాక్సిడెంట్ లో నటి మనీషా మృతి!

సారాంశం

భోజ్ పురి నటి మనీషా రాయ్(45) రోడ్డు ప్రమాదంలో చనిపోవడం

భోజ్ పురి నటి మనీషా రాయ్(45) రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. 'ఖోబర్' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా నటిగా పాపులర్ అయింది. ఆ తరువాత పలు సీరియళ్లతో పాటు సినిమాలలో కూడా నటించారు.

షూటింగ్ కోసం తన కోస్టార్ సంజీవ్ మిశ్రాతో కలిసి బైక్ మీద వెళ్తుండగా.. బల్లియాలోని చిట్టౌని గ్రామంలో యాక్సిడెంట్ జరిగింది. బైక్ వెనుక నుండి ఓ కారు వచ్చి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

తీవ్ర రక్తస్రావంతో మనీషా అక్కడికక్కడే మృతి చెందగా, సంజీవ్ మిశ్రా కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. యాక్సిడెంట్ చేసిన కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకొని శిక్షిస్తామని వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?