Bheemla Nayak: US లో ‘భీమ్లానాయక్’పరిస్దితి ఏమిటి!

Surya Prakash   | Asianet News
Published : Feb 26, 2022, 09:13 AM IST
Bheemla Nayak: US లో  ‘భీమ్లానాయక్’పరిస్దితి ఏమిటి!

సారాంశం

 విడుదలకు ముందే ‘భీమ్లా నాయక్’ అగ్రరాజ్యం అమెరికాలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది. అమెరికాలో నాలుగు వందలకుపైగా థియేటర్లలో ఈ మూవీ విడుదల చేసిన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వెల్లడిచారు. 


పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ కలెక్షన్స్ కీలకమే.  తాజాగా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భీమా నాయక్ మూవీ విడుదలైంది. యుఎస్ లోనూ భారీగా రిలీజ్ చేసారు. విడుదలకు ముందే ‘భీమ్లా నాయక్’ అగ్రరాజ్యం అమెరికాలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది. అమెరికాలో నాలుగు వందలకుపైగా థియేటర్లలో ఈ మూవీ విడుదల చేసిన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వెల్లడిచారు.  థియేటర్లు ఫిబ్రవరి 24న ప్రీమియర్ షోలు పడ్డాయి.

 దీంతో   విడుదలకు ముందే ‘భీమ్లా నాయక్’ అమెరికాలో లక్ష డాలర్లకుపైగా.. అంటే దాదాపు రూ.75లక్షల వరకూ వసూలు చేసింది.  ప్రీమియర్ షోలతో 8.7 లక్షల డాలర్లు అందుకొంది.ఈ విషయాన్ని అమెరికాలో ‘భ్లీమా నాయక్’ను విడుదల చేస్తున్న ప్రైమ్ మీడియా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొదటి రోజు మొదటి గంట అడ్వాన్స్ బుకింగ్ తోనే మిలియన్ డాలర్ మార్కుని దాటేయటం రికార్డ్ గా చెప్పారు. ‘భీమ్లా నాయక్’యుఎస్ లో ఫైనల్ గా ఎంత వసూళ్లు అందుకుంటుంది అనేది రికార్డ్ స్దాయిలో ఉంటుందని,అక్కడ నడుస్తున్న ట్రెండ్ ని చూసి ట్రేడ్ లో అంచనా వేస్తన్నారు.
 
భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనర్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'భీమ్లా నాయక్' చిత్రంతో పవర్ స్టార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ఇప్పటికే అభిమానులు ప్రచారం చేస్తున్న విషయం తెలసిందే.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం