Bheemla Nayak:“భీమ్లా నాయక్” హిందీ రిలీజ్ ఉందా,లేదా? క్లారిటీ ఇదిగో

Surya Prakash   | Asianet News
Published : Feb 26, 2022, 07:24 AM IST
Bheemla Nayak:“భీమ్లా నాయక్” హిందీ రిలీజ్ ఉందా,లేదా? క్లారిటీ ఇదిగో

సారాంశం

 ప్రస్తుతం థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ సందడి నడుస్తోన్న నేపధ్యంలో  మెగా అభిమానులు సినిమా హాళ్లలో రచ్చరచ్చ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఈ చిత్రం హిందీ రీలీజ్ ఏమైంది...అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ చిత్రం “భీమ్లా నాయక్” ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలనుంచే   హిట్ టాక్ వచ్చేసింది.  ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ సందడి నడుస్తోన్న నేపధ్యంలో  మెగా అభిమానులు సినిమా హాళ్లలో రచ్చరచ్చ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఈ చిత్రం హిందీ రీలీజ్ ఏమైంది...అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ఈ సినిమా హిందీ రిలీజ్ మాత్రం మరో వారం వాయిదా పడింది. అసలు మొదట “భీమ్లా నాయక్” నిర్మాతలు సినిమాను ఏకకాలంలో తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. B4U మోషన్ పిక్చర్స్ ఈ చిత్రం హిందీ హక్కులను సొంతం చేసుకుంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో లేటు  కారణంగా నిర్మాతలు “భీమ్లా నాయక్” హిందీ విడుదలను ఒక వారం వాయిదా వేశారు.

“భీమ్లా నాయక్” హిందీ కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించి,  ట్రైలర్ విడుదల చేయనున్నారు మేకర్స్. హిందీలో ఈ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాని నిన్నటి రోజే రిలీజ్ చేసి ఉంటే అక్కడ కూడా హిట్ టాక్ వచ్చేది కదా...నేషనల్ మీడియా కూడా ఈ సినిమా గురించి మాట్లాడేది కదా అని అభిమానులు వాపోతున్నారు.

ఇక “భీమ్లా నాయక్” మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ అన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. పవన్ కళ్యాణ్, రానా పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం