Balakrishna Dual Role: మరోసారి ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ... ? ఈ సారి కొత్తగా ప్లాన్ చేసిన డైరెక్టర్..

Published : Feb 26, 2022, 07:52 AM ISTUpdated : Feb 26, 2022, 07:54 AM IST
Balakrishna Dual Role: మరోసారి ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ... ? ఈ సారి కొత్తగా ప్లాన్ చేసిన డైరెక్టర్..

సారాంశం

సినిమాల విషయంలో ఎప్పుడో సెంచరీ కొట్టిన బాలయ్య(Balakrishna).. స్పీడ్ పెంచీ దూసుకుపోతున్నారు. కొత్త కథలు..డిఫరెంట్ గెటప్పులతో అదరగొడుతున్న బాలకృష్ణ ఈసారి సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు.  

సినిమాల విషయంలో ఎప్పుడో సెంచరీ కొట్టిన బాలయ్య(Balakrishna).. స్పీడ్ పెంచీ దూసుకుపోతున్నారు. కొత్త కథలు..డిఫరెంట్ గెటప్పులతో అదరగొడుతున్న బాలకృష్ణ ఈసారి సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు.  

కెరీర్ లో ఎన్నో సినిమాల్లో చాలా సార్లు డ్యూయల్ రోల్ చేశారు బాలకృష్ణ(Balakrishna). వంద సినిమాలు పూర్తి చేసుకున్న తరువాత కూడా ద్విపాత్రాభినయం పై ఇష్టం ఇంకా పెరిగింది నట సింహానికి. అందుకే వరుసగా డ్యూయల్ రోల్స్ చేస్తున్నాడు బాలయ్య బాబు(Balakrishna). రీసెంట్ గా అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బాలకృష్ణ.. ఈ సినిమాలో అన్న దమ్ములుగా రెండు పాత్రల్లో అలరించాడు.

అఖండాలో  అఘోరా పాత్రలో బాలయ్య బాబు(Balakrishna)ను చూసిన ఫ్యాన్స్ ఫూనకాలతో ఊగిపోయారు. ఆ పరమేశ్వరుడే దిగి వచ్చాడు అన్నంతలా సంబరపడిపోయారు.  ఇక ప్రస్తుతం బాలకృష్ణ (Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్టార్ట్ అయ్యింది. కెరియర్ పరంగా బాలకృష్ణ 107వ సినిమా ఇది. మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా సిరిసిల్లలో  ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకుంది.

రాయలసీమ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలయ్య (Balakrishna) డ్యూయర్ రోల్ లో మెరవబోతున్నట్టు తెలుస్తోంది. అక్కడి నీటి సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుందనేది తాజా సమాచారం. ఈ సినిమాలో బాలయ్య (Balakrishna)తండ్రీకొడుకులుగా కనిపిస్తారని ఇండస్ట్రీ టాక్. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే శృతీహాసన్  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో  చేస్తున్న మూడో సినిమా ఇది. అంతే కాదు ఈసినిమాలో ఓఇంపార్టెంట్ రోల్ లో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈసినిమాకు వీరసింహా రెడ్డి, వేట పాలేం, లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.  భారీ బడ్జెట్ తో రూపొందుతున్న బాలయ్య (Balakrishna) సినిమా కోసం రీసెంట్ గా రామ్ లక్ష్మణ్స్ తో.. భారీగా యాక్షన్ సీక్వెన్స్ లను కూడ ప్లాన్ చేశారు.

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?