
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయాల్సింది. కానీ అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దీనితో ఎన్టీఆర్ కొరటాల శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్రివిక్రమ్ తో చిత్రం ఎందుకు ఆగిపోయిందో అభిమానులకు క్లారిటీ లేదు. దీనితో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే ప్రచారం జరిగింది.
దీనిపై తాజాగా భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. నాగవంశీ మాట్లాడుతూ.. త్రివిక్రమ్, తారక్ అన్న కాంబినేషన్ రద్దు కాలేదు. జస్ట్ వాయిదా పడింది అని క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ గారు చాలా పెద్ద లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు. అది పాన్ ఇండియా చిత్రం. ఆయన అనుకున్న పాయింట్ అద్భుతమైనది. ప్రస్తుతం వర్కౌట్ చేస్తున్నారు.
భారీ స్కేల్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే చిత్రం కాబట్టి టైం పడుతుంది అని నాగవంశీ పేర్కొన్నారు. తారక్ అన్నకు ఆ కథ చాలా బాగా సూట్ అవుతుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిలిమ్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది అని నాగవంశీ అన్నారు.
త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆల్రెడీ 'అరవింద సమేత' చిత్రం వచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ ఫుల్ మాస్ గా ప్రజెంట్ చేశారు. దీనితో వీరిద్దరి కాంబినేషన్ పై ఒకరేంజ్ లో అంచనాలు ఉన్నాయి.