
షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయన ఎంట్రీ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో రూమార్లు తెగ హల్ చల్ చేస్తున్నారు. అయితే ఆర్యన్ ఖాన్ సినిమా నిర్మాణంలో ఉన్న సృజనాత్మకత గురించి తరచుగా మాట్లాడుతూ ఉండే వాడు. దీంతో ఖాన్ వారసుడు చిత్రనిర్మాతగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని, నటనపై ఆసక్తి లేదని పలువురు సీని వర్గీలు అభిప్రాయపడ్డారు. ఆ అంచనాను నిజం చేస్తూ ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ (Bollywood) ఎంట్రీపై క్రేజీ బజ్ వినిపిస్తోంది. అయితే నటుడిగా మాత్రం ఎంట్రీ ఇచ్చేందుకు ఆర్యన్ ఖాన్ ఆసక్తిగా లేనట్టు తెలుస్తోంది.
నటుడిగానే షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఎంట్రీ ఇస్తారని ఎస్ఆర్కే అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కూడా భావించారు. అచ్చు షారుఖ్ ఖాన్ పోలికలకే కలిగి ఉండటంతో ఇటు ఫ్యాన్స్ కూడా ఆర్యన్ ఖాన్ ఎంట్రీపై ఆసక్తి చూపారు. ప్రస్తుతం అందిస్తున్న సమాచారం ప్రకారం.. ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ కు ఒక ఫిల్మ్ రైటర్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. లేదంటే దర్శకత్వంవైపుగా అడుగులు వేసే అవకాశం ఉంది.
అమెజాన్ ప్రైమ్ కోసం వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరియు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఫీచర్ ఫిల్మ్ కూడా చేయనున్నట్టు సమాచారం అందుతోంది. అయితే ఫీచర్ ఫిల్మ్‌ల లిస్ట్ ఇంకా అధికారికంగా రాలేదు. తెలియలేదు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ ఏడాదిలోనే వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయని బీ టౌన్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్నట్టు కూడా పలువురు ఆరోపిస్తున్నారు. మాదకద్రవ్యాల కేసులో ఎన్‌సిబి ద్వారా అరెస్టు అయిన ఆర్యన్ ఇప్పుడిప్పుడే తన కేరీర్ పై ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. అతని భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.