
గత సంవత్సరం ‘వకీల్‌సాబ్’ చిత్రంతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన పవన్‌కల్యాణ్ ఈ ఏడాది ‘భీమ్లానాయక్’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ హీరోగా, మరో బలమైన పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు అనగానే అంచనాలు రెట్టింపు అయ్యాయి. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీప్లే అందించడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచి సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ చూద్దాం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గ లేదు అని ఈ సినిమా నిరూపించింది. నిజానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఫస్ట్ వీక్ పడుతుంది అనుకున్నారు. కానీ, ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే.. ఈ సినిమా వన్ వీక్ లోగానే లాభాల్లోకి వెళ్లిపోయేలా ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ చిత్రం నైజాం ఏరియాలో మొదటి రోజు ₹11.80 కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మిగతా ఏరియాలు చూస్తే...
సీడెడ్ 4.30 కోట్లు
ఉత్తరాంధ్ర 2.06 కోట్లు
ఈస్ట్ 2.09 కోట్లు
వెస్ట్ 2.30 కోట్లు
గుంటూరు 2.10 కోట్లు
కృష్ణా 2.01 కోట్లు
నెల్లూరు 2.18 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 32.56 కోట్లు అని తేల్చారు.
భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనర్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'భీమ్లా నాయక్' చిత్రంతో పవర్ స్టార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ఇప్పటికే అభిమానులు ప్రచారం చేస్తున్న విషయం తెలసిందే.