`భారతీయుడు2` రిలీజ్‌ డేట్.. సడెన్‌గా ట్రాక్‌లోకి కమల్‌ హాసన్‌.. పాన్‌ ఇండియా హీరోతో ఫైట్‌?

Published : Apr 06, 2024, 06:30 PM IST
`భారతీయుడు2` రిలీజ్‌ డేట్.. సడెన్‌గా ట్రాక్‌లోకి కమల్‌ హాసన్‌.. పాన్‌ ఇండియా హీరోతో ఫైట్‌?

సారాంశం

కమల్‌ హాసన్‌ నటిస్తున్న `ఇండియన్‌ 2` ట్రాక్‌లోకి వచ్చింది. సడెన్‌గా ఈ మూవీ అప్ డేట్‌ ఇచ్చింది టీమ్‌. రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌.   

లోక నాయకుడు కమల్ హాసన్‌.. `విక్రమ్‌` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత రెండేళ్ల గ్యాప్‌తో ఇప్పుడు `భారతీయుడు 2`తో రాబోతున్నారు. గతంలో వచ్చిన సంచలన చిత్రం `భారతీయుడు`కి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రిలీజ్‌కి సిద్ధమయ్యింది. కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ అనేక అడ్డంకులు దాటుకుని షూటింగ్‌ పూర్తి చేసుకుని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది.

తాజాగా రిలీజ్‌ డేట్‌ ఇచ్చింది టీమ్‌. సినిమాని జూన్‌లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. సేనాపతి కమ్‌ బ్యాక్‌ అంటూనే `ఇండియన్‌ 2` రాబోతుందని వెల్లడించింది.  జూన్‌లో సినిమాని రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. అయితే పర్టిక్యూలర్‌గా ఒక డేట్‌ని ఇవ్వలేదు. ఏదో ఒక డేట్‌ని కన్ఫమ్‌ చేసే అవకాశం ఉంది. 

ఇక శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సిద్దార్థ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. కమల్‌కి జోడీగా కాజల్‌, సిద్ధార్థ్‌కి జోడీగా ముఖ్య పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తుంది. లైకా పిక్చర్స్ నిర్మిస్తుంది. జీరో టోలరెన్స్ అనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సమాజంలో అవినీతితోపాటు అసహనం అనే అంశాల ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. 

ఇక ఈ మూవీ చూడబోతుంటే `కల్కి2898ఏడీ`తో పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. `కల్కి` మేలో విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా వేస్తున్నారు. మే చివరి వారంలోగానీ జూన్‌లోగానీ రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. ఇదే జరిగితే ఇప్పుడు `భారతీయుడు 2`, `కల్కి2898ఏడీ` ల మధ్య పోటీ తప్పుదు. పాన్‌ ఇండియా స్టార్‌తో కమల్‌ పోటీ పడాల్సి వస్తుంది. అంతేకాదు `కల్కి`లో కమల్‌ గెస్ట్ రోల్‌లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇలా `కల్కి` వస్తే కమల్‌తో కమల్‌కే పోటీ అని చెప్పొచ్చు. ఏం జరుగుతుందో చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌