అది మా తప్పే...  బహిరంగ క్షమాపణలు చెప్పిన భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడి! 

భగవంత్ కేసరి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సినిమాలో జరిగిన మిస్టేక్ కి దర్శకుడు అనిల్ రావిపూడి. 
 

bhagavanth kesari director anil ravipudi apologizes mistake made by them ksr

దసరా కానుకగా బాలకృష్ణ భగవంత్ కేసరి విడుదలైంది. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు పడ్డాయి. దర్శకుడు అనిల్ రావిపూడి బాలకృష్ణను కొత్తగా ఆవిష్కరించాడు. డాటర్-ఫాదర్ సెంటిమెంట్ కుదిరింది. యాక్షన్ ఎపిసోడ్స్ అలరించాయన్న మాట వినిపించింది. పాజిటివ్ టాక్ నేపథ్యంలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి, శ్రీలీలతో పాటు నిర్మాతలు పాల్గొన్నారు. 

సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన అనిల్ రావిపూడి ఓ రివ్యూవర్ మీద అసహనం వ్యక్తం చేశాడు. ఒక ఫోబియాతో బాధపడుతూ, ఆర్మీలో చేరడం లక్ష్యంగా కష్టపడే అమ్మాయిగా శ్రీలీల పాత్రను డిజైన్ చేశాము. కానీ ఓ రివ్యూవర్ ఆ పాత్ర నుండి డాన్స్ లు ఆశించాడు. ఆ రివ్యూ రాసిన వ్యక్తి ఎవరో నాకు తెలుసు. ఆయన చాలా రాస్తూ ఉంటారు. సినిమా చూసే దృష్టి కోణం అంత దారుణంగా ఉందన్నారు. 

Latest Videos

తండ్రి కూతుళ్ళ ఎమోషనల్ డ్రామాలో శ్రీలీల నుండి గ్లామర్, డాన్సులు ఆశించడం ఏంటన్న అర్థంలో అనిల్ రావిపూడి మాట్లాడాడు. ఇదిలా ఉంటే ఓ విలేకరి సినిమాలు మీరు మిస్టేక్ చేశారు. శరత్ కుమార్ సినిమాలో జైలర్. కానీ బ్రేకింగ్ న్యూస్ లో సీఐ మరణం అని స్క్రోలింగ్ వేశారు, అన్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా... అంత పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు ఇంత చిన్న మిస్టేక్ గుర్తించడం గొప్ప విషయం. 

మీ సునిశిత పరిశీలన, సూక్ష బుద్ధికి హ్యాట్సాఫ్. జైలర్ ని సీఐ అని న్యూస్ చెప్పడం తప్పే. మావాళ్లు పొరపాటుగా అలా వేసి ఉంటారు. అందుకు క్షమాపణలు, అన్నారు. మరోవైపు టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేదు. బ్లాక్ బస్టర్ అంటూ ఊదరగొట్టారు. ఫస్ట్ డే  కలెక్షన్స్ మాత్రం చిరంజీవి డిజాస్టర్ భోళా శంకర్ ని కూడా దాటలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అఖండ రూ. 15.3 కోట్లు, వీరసింహారెడ్డి రూ. 25 కోట్ల షేర్ రాబట్టాయి. భగవంత్ కేసరి చిత్రానికి కేవలం రూ. 12-13 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్.. 
 

vuukle one pixel image
click me!