‘భగవంత్‌ కేసరి’ప్రీ రిలీజ్ బిజినెస్ కేకే కానీ చిన్న ట్విస్ట్

Published : Aug 19, 2023, 09:55 AM IST
‘భగవంత్‌ కేసరి’ప్రీ రిలీజ్ బిజినెస్ కేకే కానీ చిన్న ట్విస్ట్

సారాంశం

‘రాజు ఆని ఎనకున్న వందల మంది మందను చూయిస్తడు. మొండోడు ఆనికున్న ఒకే ఒక్క గుండెను చూయిస్తడు’’ అంటూ బాలకృష్ణ చెప్పే శక్తిమంతమైన డైలాగ్‌తో ...


 నందమూరి బాలకృష్ణ 'భగవంత్‌ కేసరి’గా దసరా బరిలో దుమ్ములేపేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ హీరోయిన్. అర్జున్‌ రాంపాల్‌, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబరు 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘భగవంత్‌ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది’ గన్స్‌ పట్టుకుని బాలకృష్ణ నడిచి వస్తున్న ఫొటోతో ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఓ రేంజిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. 

 ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 'భగవంత్ కేసరి' నైజాం థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను 14 కోట్ల రూపాయలకు అమ్మినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సీడెడ్ (రాయలసీమ) హక్కులు రూ. 12 కోట్లు పలకగా... ఆంధ్ర ఏరియా హక్కులను సుమారు 34 కోట్ల రూపాయలకు ఇచ్చారని తెలుస్తోంది.  ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్టాల హక్కులను రూ. 60 కోట్లకు అమ్మేశారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే... 'వీర సింహా రెడ్డి' సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 63 కోట్లు. దాంతో పోలిస్తే... 'భగవంత్ కేసరి'కి  మూడు కోట్లు  తక్కువే. 

థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా 'భగవంత్ కేసరి'కి వచ్చిన రూ. 60 కోట్లు ప్రక్కన పెడితే... ఓటీటీ / డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా రూ. 36 కోట్లు వచ్చినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని టాక్. విడుదలకు ముందు నిర్మాతలకు దాదాపుగా 100 కోట్లు వచ్చాయి.

 'భగవంత్ కేసరి'కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 62 కోట్లు.  దసరా బరిలో సినిమా విడుదల అవుతుంది కనుక  సినిమా ఓ మాదిరిగా ఉన్నా దుమ్ము రేపుతుంది. ఇక సూపర్ గా ఉంటే చెప్పక్కర్లేదు.  దసరా అక్టోబర్ 19 గురువారం వచ్చింది. అప్పటి నుంచి 24వ తేదీ పండగ వరకు సెలవులు ఉంటాయి కనుక మంచి కలెక్షన్స్  వచ్చే అవకాశం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే