పెళ్లి డేట్‌ ఫిక్స్ చేసేది ఆమెనే.. ఇక్కడ ఇష్టం లేదు, అందుకే డెస్టినేషన్‌ మ్యారేజ్‌.. వరుణ్‌ తేజ్‌ వ్యాఖ్యలు..

Published : Aug 18, 2023, 11:11 PM IST
పెళ్లి డేట్‌ ఫిక్స్ చేసేది ఆమెనే.. ఇక్కడ ఇష్టం లేదు, అందుకే డెస్టినేషన్‌ మ్యారేజ్‌.. వరుణ్‌ తేజ్‌ వ్యాఖ్యలు..

సారాంశం

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్‌ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పెళ్లెప్పుడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.  తాజాగా దీనిపై హీరో వరుణ్‌ తేజ్‌ స్పందించారు. మ్యారేజ్‌ డేట్‌, ప్లేస్‌ వంటి అంశాలపై ఆయన ఓపెన్‌ అయ్యారు. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాయి. ఆయన ఇటీవల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పెళ్లెప్పుడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దానికోసం అభిమానులు కూడా వెయిట్‌ చేస్తున్నారు. అయితే మ్యారేజ్‌ డేట్‌పై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఫైనల్‌ కాలేదు. తాజాగా దీనిపై హీరో వరుణ్‌ తేజ్‌ స్పందించారు. మ్యారేజ్‌ డేట్‌, ప్లేస్‌ వంటి అంశాలపై ఆయన ఓపెన్‌ అయ్యారు. 

మ్యారేజ్‌ డేట్‌ ఇంకా ఫైనల్‌ కాలేదని తెలిపారు. నవంబర్‌లోగానీ, డిసెంబర్‌లోగానీ ఉండే అవకాశం ఉందన్నారు. అయితే మ్యారేజ్‌ డేట్‌ని ఫిక్స్ చేసేది మాత్రం తన అమ్మనే అట. ఆమె చేతుల్లోనే డేట్‌ని ఖరారు చేయాల్సిందన్నారు. మరోవైపు మ్యారేజ్‌ చేసుకునే ప్లేస్‌ గురించి ఆయన రియాక్ట్ అవుతూ, మ్యారేజ్‌ ప్రైవేట్‌గా చేసుకోవాలనుకుంటున్నారట. అది మన హైదరాబాద్‌ సాధ్యం కాదని, అందుకే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఇండియాలో మూడు ప్లేస్‌లను, విదేశాల్లో రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నారట. త్వరలోనే ఓ ప్రాంతాన్ని ఫైనల్‌ చేస్తామన్నారు వరుణ్‌ తేజ్. ముందు డేట్‌ అనుకున్నాక, ప్లేస్‌ని డిసైడ్‌ చేస్తామన్నారు.

ఈ సందర్భంగా లవ్‌ ప్రపోజల్‌ గురించి వరుణ్‌ తేజ్‌ చెబుతూ, ముందు లావణ్య త్రిపాఠినే ఈ లవ్‌ ప్రపోజల్‌ పెట్టిందట. తాను ఓకే చెప్పినట్టు తెలిపారు. తాను వాడుతున్న ఫోన్‌ని కూడా లావణ్య గిఫ్ట్ గా ఇచ్చిందని వెల్లడించారు. ఇక వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి మొదట `మిస్టర్‌` చిత్రంలో కలిసి నటించారు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత `అంతరిక్షం` చిత్రంలో నటించారు. ఆ టైమ్‌లో ప్రేమ మరింత బలపడింది. స్నేహితులుగా స్టార్ట్ అయి ప్రేమికులుగా మారినట్టు వెల్లడించారు. జూన్‌9న ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ `గాంఢీవధారి అర్జున` చిత్రంలో నటిస్తున్నారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. వరుణ్‌కి జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్‌ఘా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్‌ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్‌ తేజ్‌ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే