
వరుస పాన్ ఇండియా సినిమాలతో.. బిజీ షెడ్యూల్స్ తో హడావిడిగా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తాజాగా ఆయన ఈ బిజీ షెడ్యూల్స్ కు బ్రేక్ ఇచ్చి.. రెస్ట్ తీసుకోబోతున్నారట. మోకాలి సమస్య రావడంతో..ప్రభాస్ శస్త్రచికిత్స చేయించుకోవడానికి తన బిజీ షెడ్యూల్ నుండి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బాహుబలి సినిమాలతో గ్లోబల్ ఫినామినేషన్‌గా మారిన ప్రభాస్.. రెస్ట్ లెస్ గా పనిచేస్తున్నాడు. భారీ ప్రాజెక్ట్ లను వరుస గా సెట్స్ ఎక్కించిన ప్రభాస్.. ఆ సినిమాల కోసం బాగా కష్టపడుతున్నాడు. అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు.
అయితే ఈ హాడావిడిలో ప్రభాస్ మోకాలి సమస్య రావడంతో.. నొప్పితో బాగా ఇబ్బందిపడుతూ వస్తున్నాడు. ఈసమస్య చాలా ఎక్కువ కావడంతో.. కోలుకోవడంపై దృష్టి పెట్టాడు ప్రభాస్. అందుకే మోకాలికి సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నాడట ప్రభాస్.. ప్రభాస్ చివరిగా 'ఆదిపురుష'లో కనిపించాడు. ఆయన చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి. మూడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలే. వరుసగా షూటింగ్స్ లో పాల్గొంటున్న యంగ్ రెబల్ స్టార్ సర్జరీ చేయించుకుని కోలుకోలుకున్నాకనే నెక్ట్స్ సినిమాలను లైన్ లో పెట్టాలని చస్తున్నాడు.
సినిమా వర్గాల సమాచారం ప్రకారం... ఇప్పుడు ఉన్న సినిమాలు అన్నీ కంప్లీట్ చేసిన తరువాత మోకాలు సర్జరీ చేయించుకోవాలి అని ముందుగా భావించాడట ప్రభాస్... కాని కాలి నొప్పి ఎక్కువ అవ్వడం... డాక్టర్లు కూడా త్వరగా సర్జరీచేయించుకుంటే మంచిదని చెప్పడంతో షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వబోతున్నాడట గ్లోబల్ స్టార్.. అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గామాత్రం బయటకు రానివ్వలేదు.
అయితే ప్రభాస్ చేయాల్సిన సినిమాలు.. భారీ షెడ్యూల్స్ చాలా ఉన్నాయి. ఇవి పూర్తి కావాలంటే రెండుమూడేళ్లు పట్టే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు సర్జరీ చేయించుకున్నా.. షూటింగ్స్ కు మాత్రం సుదీర్ఘ విరామం తీసుకునే అవకాశం చాలా తక్కువే అని సమాచారం. మారుతీ రాజా 'డీలక్స్' నుండి సందీప్ రెడ్డి వంగ యొక్క 'స్పిరిట్' వరకు, ప్రభాస్ షెడ్యూల్స్ లాక్ చేయబడి ఉన్నాయి. దాంతో నిర్విరామంగా పనిచేస్తేనే ఈ సినిమాలు కంప్లీట్ అవుతాయి. సలర్ మూవీ చివరిదశలో ఉంది.. మారుతీతో మూవీ స్టార్ట్ చేశాడు.. అటు నాగ్ అశ్వీన్ యాక్షన్ మూవీ కోసం బాగా కష్టపడుతున్నాడు... సందీప్ తో స్పిరిట్ స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇలా ప్రభాస్ చాలా కాలం పాటు బిజీగా ఉండనున్నాడు.
అదే సమయంలో, సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభాస్ చివరిసారిగా ఓం రౌత్ డైరెక్షన్ లో రామాయణం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్'లో కనిపించాడు. అతను త్వరలో ప్రశాంత్ నీల్ యొక్క 'సలార్ ను కంపన్లీట్ చేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 28, 2023న రిలీజ్ కాబోతోంది. ఇక ప్రభాస్ డెడికేషన్ ను మెచ్కుకుంటూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ హార్డ్ వర్క్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. అదే టైమ్ లో తన ఆరోగ్యం గురించి కూడా చూసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. ఇక ప్రభాస్ త్వరగా కోలుకోవాలని వారు ఆశీస్తున్నారు. సలార్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.