చిరంజీవి బ్లడ్ బ్రదర్ ని కరోనా కాటేసింది.. విషాదంలో మెగా ఫ్యామిలీ!

Published : Apr 21, 2021, 11:52 AM IST
చిరంజీవి బ్లడ్ బ్రదర్ ని కరోనా కాటేసింది.. విషాదంలో మెగా ఫ్యామిలీ!

సారాంశం

రాయలసీమ కదిరి ప్రాంతానికి చెందిన ప్రసాద్ రెడ్డి చాలా కాలంగా మెగా ఫ్యామిలీ అభిమానిగా ఉన్నారు. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

చిరంజీవి వీరాభిమానిగా ఏళ్ల తరబడి సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రసాద్ రెడ్డి కరోనా సోకి మరణించారు. ఈ వార్త తెలుసుకున్న చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ సభ్యులైన నాగబాబు, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రసాద్ రెడ్డి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. 


రాయలసీమ కదిరి ప్రాంతానికి చెందిన ప్రసాద్ రెడ్డి చాలా కాలంగా మెగా ఫ్యామిలీ అభిమానిగా ఉన్నారు. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మెగా ఫ్యామిలీ కి అత్యంత సన్నిహితుడిగా, వారిలో ఒకరిగా ఆ కుటుంబ కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్నారు. 


ఇటీవల ప్రసాద్ రెడ్డి కరోనా బారినపడ్డారు. చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ప్రసాద్ రెడ్డి మరణం తనను తీవ్రంగా కలచివేసినట్లు చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రసాద్ రెడ్డి మరణంతో బ్లడ్ బ్రదర్ ని కోల్పోయినట్లు చిరంజీవి తెలిపారు. ప్రసాద్ రెడ్డి కుటుంబానికి సంతాపం ప్రకటించారు. 


చిరంజీవి తమ్ముడు నాగబాబు సైతం ప్రసాద్ రెడ్డి మరణంపై స్పందించారు. ప్రసాద్ రెడ్డితో తనకు గల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రతి చిన్న విషయాన్ని ప్రసాద్ రెడ్డి తనతో పంచుకునే వారని విచారం వ్యక్తం చేశాడు. ప్రసాద్ రెడ్డి కుటుంబానికి మెగా అభిమానులు, కుటుంబం సప్పోర్ట్ ఎప్పుడూ ఉంటుందని, తెలియజేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..