ఫ్లాప్ దర్శకుడికి బెల్లకొండ వారి అండ!

Published : Nov 26, 2018, 02:22 PM IST
ఫ్లాప్ దర్శకుడికి బెల్లకొండ వారి అండ!

సారాంశం

జయాపజయాలతో సంబంధం లేకుండా బెల్లకొండ వారసుడు సాయి శ్రీనివాస్ వరుసగా అవకాశాలను అందుకుంటున్నాడు. మొదటి సినిమా అల్లుడు శ్రీను తప్పితే ఏ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోనప్పటికీ భారీ బడ్జెట్ సినిమాలతోనే ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. 

జయాపజయాలతో సంబంధం లేకుండా బెల్లకొండ వారసుడు సాయి శ్రీనివాస్ వరుసగా అవకాశాలను అందుకుంటున్నాడు. మొదటి సినిమా అల్లుడు శ్రీను తప్పితే ఏ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోనప్పటికీ భారీ బడ్జెట్ సినిమాలతోనే ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఇక ఫ్లాప్ దర్శకులు మంచి ప్రాజెక్ట్ తో వస్తే శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. 

గతంలో అల్లరి నరేష్ - అహా నా పెళ్ళంట, పూల రంగడు సినిమాలతో సక్సెస్ అందుకున్న దర్శకుడు  వీరభద్రమ్ ఆ తరువాత నాగ్ తో భాయ్ సినిమా చేసి డిజాస్టర్ అందుకున్నాడు. ఇక ఆది సాయి కుమార్ తో చుట్టాలబ్బాయి సినిమా చేసినా మరోసారి ఈ దర్శకుడికి ఫ్లాప్ రావడంతో మరో అవకాశం రావడమే కష్టమైంది. 

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ హీరో దొరక్కపోవడంతో ఇప్పుడు బెల్లకొండ వారు అండగా నిలిచారు. ఆ కాంపౌండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. సాయి శ్రీనివాస్ సింగిల్ సిట్టింగ్ లో కథను ఒకే చేసినట్లు తెలుస్తోంది. రామ్ తళ్లూరి ఈ కాంబినేషన్ లో సినిమాను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.  

PREV
click me!

Recommended Stories

మణిరత్నం సంచలనం.. 34 ఏళ్ల బంధానికి బ్రేక్.. రెహమాన్‌ను కాదని కుర్రాడికి ఛాన్స్
Ustaad Bhagat Singh Movie Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ రివ్యూ, పవన్‌ కళ్యాణ్‌ విశ్వరూపం చూపించాడా?