'RX100' డైరెక్టర్ తో బెల్లంకొండ!

Published : Jan 03, 2019, 01:39 PM IST
'RX100' డైరెక్టర్ తో బెల్లంకొండ!

సారాంశం

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ 'RX100'చిత్ర దర్శకుడు అజయ్ భూపతితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా ఎన్ని సినిమాలు చేస్తున్నా బెల్లంకొండకి సరైన హిట్టు మాత్రం పడడం లేదు. 

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ 'RX100'చిత్ర దర్శకుడు అజయ్ భూపతితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా ఎన్ని సినిమాలు చేస్తున్నా బెల్లంకొండకి సరైన హిట్టు మాత్రం పడడం లేదు.

అయినప్పటికీ వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన 'కవచం' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ హీరో దర్శకుడు తేజతో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి 'సీత' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. 

ఈరోజు బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్టులకు సంబంధించి క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు రమేష్ వర్మతో కలిసి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. దీనిక్ సత్యనారాయణ కోనేరు, హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇది ఇలా ఉండగా ఈ హీరో మరో సినిమాకు కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ చిత్రదర్శకుడు మరెవరో కాదు.. 'RX100'చిత్రంతో సంచలనాలు సృష్టించిన అజయ్ భూపతి. 'RX100'సినిమా తరువాత అజయ్ భూపతి.. నితిన్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి కానీ ఫైనల్ గా బెల్లంకొండ వైపు మొగ్గుచూపాడు. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి.  

బెల్లంకొండ శ్రీనివాస్‌ కొత్త సినిమా ప్రకటించాడు

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు