హీరోయిన్ తో ఎఫైర్.. కుర్ర డైరెక్టర్ ఏమంటున్నాడంటే!

Published : Jan 03, 2019, 12:18 PM IST
హీరోయిన్ తో ఎఫైర్.. కుర్ర డైరెక్టర్ ఏమంటున్నాడంటే!

సారాంశం

'పటాస్' సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనీల్ రావిపూడి ఆ తరువాత 'సుప్రీం', 'రాజా ది గ్రేట్' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం ఇతడు డైరెక్ట్ చేసిన 'ఎఫ్ 2' సినిమా సంక్రాంతికి రాబోతుంది. 

ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు ఈ దర్శకుడు. ఇది ఇలా ఉండగా.. 'రాజా ది గ్రేట్' సినిమా సమయంలో ఈ కుర్ర డైరెక్టర్ ఓ హీరోయిన్ తో చాలా చనువుగా ఉంటున్నాడని, వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయాలపై  స్పందించని ఈ దర్శకుడు 'ఎఫ్2' సినిమా ప్రమోషన్స్ లో దీనిపై రెస్పాండ్ అయ్యాడు.

తనేంటో తనకు తెలుసునని విమర్శకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నాడు. ''అందులో ఎంత నిజముందో, ఎంత అబద్ధముందో నాకు తెలుసు. అప్పట్లో ఆ రూమర్ వచ్చిన తరువాత చాలా మంది పబ్లిక్ గా ఖండించారు. పుకారు వచ్చిందని మనమే ముందుకెళ్లి ఎందుకు ఖండించాలి. అందుకే ఊరుకున్నాను.

నన్ను విమర్శించే హక్కు వాళ్లకుంది. ఆ విమర్శలకు స్పందించాలా..? వద్దా..? అనేది నా ఇష్టం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి గాసిప్స్ ని తాను పెద్దగా పట్టించుకోనని తప్పు చేస్తే తప్ప ఇలాంటి వార్తలకు బాధ్యత తీసుకోనని స్పష్టం చేశాడు. 

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు