బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై కేసు నమోదు, మండిపడుతున్న నెటిజన్లు కారణం ఏంటంటే..?

Published : May 15, 2025, 04:52 PM IST
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై కేసు నమోదు, మండిపడుతున్న నెటిజన్లు కారణం ఏంటంటే..?

సారాంశం

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు వివాదంలో చిక్కుక్కొన్నాడు. ట్రాఫిక్ పోలీస్ ను బెదిరించడంతో పాటు, ఆయనపై దురుసగా ప్రవర్తించడం, కారు మీదికి ఎక్కించే ప్రయత్నంచేయడంలాంటి పనులు చేశాడన్న ఆరోపణలు ఆ హీరోపై ఉన్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే?   

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మే 13వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి జర్నలిస్ట్ కాలనీ వైపు వెళ్తూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చాయి. వివరాల ప్రకారం, తన ఇంటికి చేరుకోవడానికి చౌరస్తాలో రాంగ్ రూట్‌లో కారును తీసుకెళ్లే ప్రయత్నం చేసిన శ్రీనివాస్‌ను అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ ఆపాడు.

ఈ సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ సదరు కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, అతడిపై కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ భయంతో పక్కకు తప్పుకున్నాడని సమాచారం.

ఒక ప్రైవేట్ వాహన దారుడు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "సెలబ్రిటీలుగా ఉంటూ ఇలా ప్రవర్తిస్తారా?" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు మే 15వ తేదీ బుధవారం నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై అధికారికంగా కేసు నమోదు చేశారు. ఆయన మద్యం సేవించి వాహనం నడిపించాడా లేదా అన్నది కూడా విచారణలో తేలనుంది. త్వరలోనే అతడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించనున్నట్టు సమాచారం.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం భైరవం ఈ నెల 30న విడుదల కానుంది. మంచు మనోజ్, నారా రోహిత్‌లతో కలిసి మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్‌లో మంచి హైప్‌ను సృష్టిస్తోంది. సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమయంలో ఈ వివాదం బెల్లంకొండపై నెగటివ్ ఇంపాక్ట్ చూపుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 23: విశ్వ‌క్‌కు షాకిచ్చిన అమూల్య.. మరొక ప్లాన్‌తో పెళ్లి చెడగొట్టేందుకు రెడీ
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ మామూలు ఆడది కాదు, నిమిషంలో ప్లేట్ తిప్పేసింది, మరోసారి బకరా అయిన మనోజ్