బెల్లంకొండ వారసుడు తగ్గట్లేదుగా!

Published : Oct 23, 2018, 03:23 PM IST
బెల్లంకొండ వారసుడు తగ్గట్లేదుగా!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. తండ్రి నిర్మాతగా మంచి సక్సెస్ లు అందుకున్న సంగతి తెలిసిందే. 

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. తండ్రి నిర్మాతగా మంచి సక్సెస్ లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే బెల్లంకొండ వారసుడు సాయి శ్రీనివాస్ కూడా మంచి సక్సెస్ కోసం నిరంతరం కష్టపడుతున్నాడు. ప్రయోగాత్మకమైన చిత్రాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. 

ప్రస్తుతం ఈ హీరో చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో పాటు సీనియర్ డైరెక్టర్ తేజతో కూడా సాయి శ్రీనివాస్ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అసలు విషయంలోకి వస్తే.. ఇప్పుడు మరో దర్శకుడి ప్రాజెక్ట్ కి కూడా ఈ యువ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రమేష్ వర్మ అనే దర్శకుడు చెప్పిన కథ సాయికి బాగా నచ్చేసిందట. 

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని కూడా స్టార్ట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. ప్రముఖ బిజినెస్ మెన్ అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ కొత్త యూనిట్ బిజీగా ఉంది. 

PREV
click me!

Recommended Stories

Allu Arjun `డాడీ` మూవీ చేయడం వెనుక అసలు కథ ఇదే.. చిరంజీవి అన్న ఆ ఒక్క మాటతో
Bigg Boss Telugu 9: లవర్‌కి షాకిచ్చిన ఇమ్మాన్యుయెల్‌.. కప్‌ గెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా.. తనూజ ఆవేదన