బయోపిక్ తో హీరోగా మారనున్న కమెడియన్!

Published : Oct 23, 2018, 03:16 PM IST
బయోపిక్ తో హీరోగా మారనున్న కమెడియన్!

సారాంశం

'పెళ్లిచూపులు' చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చాడు కమెడియన్ ప్రియదర్శి. ప్రస్తుతం టాలీవుడ్ లో అతడికి వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ఓ పక్క  కమెడియన్ గా నటిస్తూనే హీరోగా సినిమా చేయడానికి సిద్ధమైపోతున్నాడు. అది కూడా ఓ బయోపిక్ కావడం విశేషం. 

'పెళ్లిచూపులు' చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చాడు కమెడియన్ ప్రియదర్శి. ప్రస్తుతం టాలీవుడ్ లో అతడికి వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ఓ పక్క  కమెడియన్ గా నటిస్తూనే హీరోగా సినిమా చేయడానికి సిద్ధమైపోతున్నాడు. 

అది కూడా ఓ బయోపిక్ కావడం విశేషం. చేనేత ఇండస్ట్రీలో చింతకింది మల్లేశం పేరు తెలియని వారుండరు. నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన మల్లేశం తన తల్లి చీరలు నేయడానికి ఆసు పోయడానికి పడ్డ కష్టం చూసి అతడే  స్వయంగా ఆసు యంత్రం తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ విషయాన్ని ఇతరులకు చెబితే వారు నిరుత్సాహపరిచారు. అయినప్పటికీ పట్టుదలతో ఏడేళ్ల పాటు కష్టపడి ఆసు యంత్రాన్ని తయారు చేశారు. అతడు  తయారు చేసిన యంత్రం ఆసియాలోనే గొప్ప యంత్రంగా పేరు గాంచింది.  ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు సొంతం  చేసుకున్నాడు మల్లేశం.

ఇప్పుడు అతడి బయోపిక్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. మల్లేశం పాత్రలో ప్రియదర్శి కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించబోతున్నారు.  

PREV
click me!

Recommended Stories

Sobhita Dhulipala: 45కోట్ల ఇంట్లో నాగచైతన్య, శోభితా.. పెళ్లికి ముందే అంతా ప్లాన్‌.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?
పక్కోడి జీవితం నీకెందుకు బాసూ.! వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ ఇన్‌స్టా పోస్ట్..