‘తొలిప్రేమ’ రీరిలీజ్.. ఐదురోజుల ముందే థియేటర్ హౌజ్ ఫుల్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

By Asianet News  |  First Published Jun 25, 2023, 6:57 PM IST

మరో ఐదు రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం రీరిలీజ్ కాబోతోంది. ఇప్పటికే పవన్ చిత్రాలు రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం మరింత ఆసక్తిని చూపుతున్నారు. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్  ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 
 


టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ కొసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల పుట్టిన రోజులకు, పలు ప్రత్యేక రోజున వారి హిట్ చిత్రాలను మళ్లీ విడుదల చేస్తూ వస్తున్నారు. అప్పటి చిత్రాలను ఫ్యాన్స్  మళ్లీ థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ సక్సెస్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’, ‘ఖుషీ’ చిత్రాలు రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో బ్యూటీఫుల్ ఫిల్మ్  రీరిలీజ్ కు సిద్ధమైంది. 

 తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్ హిట్ గా నిలిచిన ప్రేమ కథా చిత్రాల్లో 'తొలిప్రేమ' ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.సి. ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి.రాజు నిర్మించిన ఈ చిత్రం 1998 జూలైలో విడుదలై ఘన విజయం సాధించింది. ఓ మధ్య తరగతి యువకుడి తొలిప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతను కట్టిపడేసింది. ప్రేమ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు, దేవా స్వరపరిచిన పాటలు ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే అతికొద్ది సినిమాల్లో ఒకటిగా 'తొలిప్రేమ' ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ వెండితెర మీద చూసే అద్భుతమైన అవకాశం లభిస్తోంది.

Latest Videos

'తొలిప్రేమ' విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4k వెర్షన్ లో విడుదల చేస్తున్నారు. శ్రీ మాతా క్రియేషన్స్ విడుదల చేస్తున్న ఈ చిత్రం జూన్ 30న 300 కి పైగా థియేటర్లలో భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న ఈ మూవీ రీ-రిలీజ్ ట్రైలర్ ను కూడా నిన్న విడుదల చేశారు. ట్రైలర్ వేడుక శనివారం ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ చిత్రం రీరిలీజ్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఎప్పుడెప్పుడు సినిమా  చూసేద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 

అయితే, తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది. తొలిప్రేమ రీరిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్  ముందుగానే టికెట్స్  బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ 70 ఎంఎంలో హౌజ్ ఫుల్ అయినట్టు సమాచారం. ఐదు రోజుల ముందే ఇంతటి రెస్పాన్స్  రావడంతో అభిమానులు ఈ చిత్రాన్ని ఎలా సక్సెస్ చేయబోతున్నారో అర్థం అవుతోంది. మున్ముందు మరిన్ని థియేటర్లు కూడా ఫుల్ కానున్నాయని అంటున్నారు. ఇక చిత్రం రీరిలీజ్ సందర్భంగా ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. "తొలిప్రేమ అనేది ఒక గొప్ప జ్ఞాపకం. ఇందులో భాగమైన పవన్ కళ్యాణ్, కరుణాకరన్, జి.వి.జి.రాజు అందరికీ మరిచిపోలేని జ్ఞాపకం ఈ చిత్రం. నా సినీ ప్రయాణంలో తొలిప్రేమకి అంటూ ఓ ప్రత్యేక పేజీ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ గా అప్పుడప్పుడే నా ప్రయాణం మొదలైంది. అలాంటి తొలిప్రేమలో నేను భాగమైనందుకు ఎప్పటికీ గర్వపడతాను. ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ ఈ సినిమా చూడాలనిపిస్తుందన్నారు. 

ఇక దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ.. "వర్షం భూమ్మీద ఎక్కడైనా పడొచ్చు. కానీ సరైన చోటులో పడితేనే ఆ వాన చినుకులకు విలువ వస్తుంది. నా కథ అనేది కళ్యాణ్ గారి చేతిలో పడింది. అందువల్లే ఇంత పెద్ద హిట్ అయింది. నిర్మాత జి.వి.జి.రాజు గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా చేయడం నా అదృష్టం. ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే భావోద్వేగానికి లోనవుతున్నాను. ఈ ఒక్క చిత్రం నా జీవితాన్ని మార్చేసింది. నేను ఎప్పుడు ఎక్కడికెళ్లినా నా అమ్మనాన్న పవన్ కళ్యాణ్ అని చెబుతుంటాను. నా అన్నయ్య పవన్ కళ్యాణ్ వల్లే ఇంత పెద్ద హిట్ ఇవ్వడం జరిగింది. నా అన్నయ్యకి ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను" అన్నారు.

click me!